- 19-1-2010
- మార్కెట్ నాడి
నిన్న అమెరికా మార్కెట్ల కు సెలవ కారణం గా నేడు ఆసియా మార్కెట్లు తమదైన శైలి లో మిశ్రమంగా పయనిస్తున్నాయి .ఈ మార్కెట్ల లో నేడు కమోడిటిలు,మెటల్స్, మైనింగ్ రంగాలు భారి గా లాభాపడుతున్నాయి .కాగా బ్యాంకింగ్ ,ఆటో రంగాలు కుదేలు మనటం తో ఆసియా మార్కెట్ల లో నేడు నందులకి ( బుల్ల్స్ ) , భల్లూకాలకి ( bears ) నడుమ గట్టి పోటి నెలకొని ఉంది. ప్రధానం గా ఆస్ట్రేలియా దిగుమతులు పెరగటం ,జపాన్ IIP గణాంకాలు క్షీనించటం , దుబాయ్ తమకు అభుదాభి ముందుగా ప్రకటించిన $10 బిలియెన్ డాలర్ల సహాయం లో కేవలం $5 బిలియన్ల ను మాత్ర మే ఇస్తున్నట్లు ప్రకటించటం మున్నగు అంశాలు స్టాకుల పై వత్తిడి ని పెంచుతున్నాయి. నిన్న ఐరోపా విడుదల అయిన వివిధ దేశాల గణాంకాలను టూకీగా చర్చిస్తే, ఫ్రాన్స్ 2010 నకు గాను అభివృద్ధి ఆశాజనకం గా ఉండగలదని, అదే జర్మనీ , ఇటలీ మున్నగు దేశాల పరిస్థితి అగమ్యగోచరం గా వుండనున్నదని అంచనాలు వెలువడ్డాయి. దీనితో అమెరికా డాలర్ బలపడి యూరో క్షీణిస్తోంది. ఐతే, uk లో నూతన గృహ అమ్మకాలు జోరందు కోవడం వంటి అంశాల వలన నేడు పౌండ్ బలపడే అవకాశం ఉంది. కాబట్టి నేడు ఐరోపా మార్కెట్లు కూడా కొంత మిశ్రమంగా పయనించే ఆస్కారం ఉంది. మన దేశానికి సంబంధించిన అంశాలను సమీక్షిస్తే, BSNL మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల లో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నహాలు మార్కెట్ల లో కొంత ఉత్సాహం నింపే అవకాశం ఉంది. పైగా ప్రస్తుతం కంపనీలు నమోదు చేస్తున్న ఆశాజనక ఫలితాలు కూడా మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అదే విధం గా రిజర్వు బ్యాంక్ , ఉద్దేపనల ఉపసంహరణ సరి అయిన సమయం లోనే తీసుకోవాలని, లేకపోతె ప్రమాదమని తెలియచేయటం కూడా మార్కెట్లకు భరోసా ఇచ్చే విధం గా ఉండటం గమనార్హం నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17641
- అవరోధాలు: 17735-17824-18000
- మద్దత్తులు: 17620-17578- 17493-17373