• 18-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నష్టాల తో ప్రారంభమైన మన మార్కెట్లు , ఉదయం మా అంచనాలను నిజం చేస్తూ క్రేమేపి లాభాల బాట లో నడిచాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 87 పాయింట్లు లాభ 17641పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 22 పాయింట్లు లాభాలను నమోదు చేస్తూ 5274 పాయింట్ల వద్ద ముగిసింది.

నేడు PSU స్టాకులు మార్కెట్లు లాభాపడెందుకు ప్రధాన పాత్ర పోషించాయి. 2010 సంవత్సరానికి గాను PSU రంగ సంస్థల నుండి పెట్టుపడులను ఉపసంహరిస్తూ మార్కెట్ల నుండి 24000 కోట్ల రూపాయలను సమీకరించాలన్న లక్షం తో ఉన్నదని ప్రభుత్వం ప్రకటించటం తో PSU స్టాకుల లో జోరు అందుకున్నది.

నేడు మిడ్క్యాప్ రంగ 0.57శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.63 శాతం లాభాలను ఆర్జించాయి. సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు బ్యాంకింగ్ రంగం 2.4 % , PSU ఇండెక్స్ 1.9 % వృద్ధి చెంది మదుపరులకు లాభాల పంట పండించింది. కాగా హెల్త్ కేర్ , చమురు మరియు గ్యాస్ 0.5 % చొప్పున నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HDFC 4.5 %, HEROHONDA 4.4 % లాభపడగా గ్రాసిం 2 % , టాటా స్టీల్ 1.2 % మేరకు నష్టపోయాయి.