- 18-1-2010
- మార్కెట్ నాడి
గత శుక్రవారం అమెరికా మార్కెట్ల లో JP MORGAN బ్యాంకు ఫలితాలు నిరాశ కు లోనుచేయడం, కన్సుమెర్ సెంటి మెంట్ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా వెలువడటం వంటి అంశాలు అమెరికా మార్కెట్లను క్షీణింప చేసాయి. ఈ ప్రభావం వలన నేడు జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు సైతం నష్టాల లో కూరుకు పోయాయి. నేడు జపాన్ లో ఉత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ కారణం వలన కూడా అక్కడి మార్కెట్లు అప్రమత్తం గా ట్రేడ్ అవుతున్నాయి. నేడు కమోడిటిలు, ముఖ్యం గా రాగి, అల్యుమి ని యం నష్టపోతున్నాయి. ఐతే నేడు ఐరోపా మార్కెట్లు కొంత ఒర్రత కలిగించే అవకాశం ఉంది. UK లో గృహ అమ్మకాల కి సంబంధించిన గణాంకాలు సానుకూలం గా నిన్న విడుదల కావటం వలన నేడు అక్కడి మార్కెట్లు కొంత లాభపడే ఆస్కారం ఉంది. ఈ కారణం వలన మధ్యాన్నం తదుపరి మన మార్కెట్లు కొంత ఊరట పొందే అవకాశం ఉంది. మన మార్కెట్ల పరం గా ఆలోచిస్తే, సెబి పలు విదేశీ పెట్టుపడి సంస్థలు యదేఛ్చగా P నోట్ల ఉల్లంఘన కి పాలుపడుతున్నందున , P నోట్ల విధానం ద్వారా స్టాక్ మార్కెట్ల లో విదేశీ పెట్టుబడులను స్వీకరించే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇది మార్కెట్ల కు స్వల్ప కాలీన కొంత ప్రతికూల అంశం. ఈ కారణాల వలన విదేశీ పెట్టుపడుల జోరు కి కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. ఐతే మన దేశపు ఆర్థికాభి వృద్ధి రేటు అత్యంత ఆకర్షణీయం గా ఉండటం వలన మన స్టాక్ మార్కెట్ల పట్ల విదేశాల లో మోజు పెరుగుతున్నందున P నోట్లను ఉపసంహరించినప్పటికీ , మన మార్కెట్ల లో FII పెట్టు బడులకు దీర్ఘకాలం లో ఎటువంటి నష్టం వాటిల్లదు. నేడు ప్రతికూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు బలహీనం గా ప్రారంభమయినా , ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన కొంత కోలుకునే అవకాశం ఉంది. నేడు మార్కెట్లకి ఆటు పోట్లు తప్పవు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17554
- అవరోధాలు: 17578-17620-17735
- మద్దత్తులు:17493-17373-17240-17124