- మార్కెట్ ముందు చూపు
- ( 18-1-2010 నుండి 22-1-2010 వరకు )
- ఐ. టి దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు అద్భుతం గా ఉండటం తో గత వారం మార్కెట్ల లో ఐ .టి స్టాకు లు సంచలనం సృష్టించాయి. ఈ వారం కూడా శుక్రవారం విడుదల కానున్న TCS ఫలితాలు మార్కెట్లను లాభాల బాట లో పయనింప చేసే ప్రయత్నం చేయవచ్చు . ఈ వారం MNM, REDDY LAB, ONGC, PUNJLLOYD, BHEL, BHARTII AIRTEL ,ASIAN PAINTS, 3I INFOTECH, IDEA, ICICI BANK, GAIL, MNM, MARUTI SUZUKI, PETRONET, TATA POWER, L & T , JSW STEEL ,SESA GOA మున్నగు కీలక కంపనీలు తమ ఫలితాలను ప్రకటించ ప్రకటించ నున్నాయి. కాబట్టి ఈ వారం మార్కెట్లు Q 3 ఫలితాల పైనే ప్రధానం గా దృష్టి సారించ నున్నాయి.
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం పై అతి త్వరలో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల చివరన చోటు చేసుకో బోయే త్రై మాసిక పరిప తి సమీక్ష లో ఈ నిర్ణయం విడుదల కానున్నది. ఈ నేపధ్యం లో రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ ని తో కూడా ఇప్పటికే చర్చించటం జరిగింది. ఈ వారం , ఈ చర్చల లో చోటుచేసుకున్న ప్రధాన అంశాల పై చూచాయగా ఒకటి రెండు ప్రకటనలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ అంశం మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. పెరుగుతున్న ద్రవ్లోబానం తో పాటు , పారిశ్రామిక ఉత్పత్తులు కూడా పుంజు కున్నందున రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచేందుకు ఆస్కారం ఉంది . ఐతే మార్కెట్లు ఇప్పటికే 50 బేసిస్ పాయింట్ల వడ్డీ పెరుగుదలపై డిస్కౌంట్ చేసాయని మా అభిప్రాయం . గత వారం బ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ నుండి పెట్టుపడులను భారి స్థాయిలో , లిక్వి డిటి కొరకు ఉపసంహరించు కున్నాయి. డిసెంబర్ Q3 ముగింపు ఇందుకు ఒక కారణం కాగా , CRR రేటు ని పెంచే అవకాశం ఉందని బ్యాంకు అంచనాలు వేయటం మరొక కారణం. పైగా పేరుకుపోతున్న బకాయిల కారణంగా 2010లో బ్యాంకుల వద్ద నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎల) విలువ గణనీయంగా పెరగనుంది. భారతీయ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల్లో దాదాపు రూ.30,000 కోట్ల మేర తిరిగి చెల్లింపబడనివిగా మారనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. బ్యాంకుల ఎన్‌పిఎలు ఒక శాతం మేర పెరగనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది. పునర్‌వ్యవస్థీకరింపబడిన బ్యాంకు రుణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, కేవలం యీ తరగతికే చెందిన దాదాపు రూ.30,000 కోట్ల విలువైన రుణాలు వచ్చే సంవత్సరానికి రాని బకాయిలుగా మారనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. తగ్గింపు రేట్లకు యిచ్చే రుణాలను పొడిగించే విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) సలహా యిచ్చిన నేపధ్యంలో యీ హెచ్చరిక రావడం గమనార్హం .ఈ కారణాల వలన బ్యాంకింగ్ స్టాకు ల లో కొంత వత్తిడి కనిపించే ఆస్కారం ఉంది. ఐతే Q 3 ఫలితాలు ఆశా జనకం గా ఉంటే ఈ స్టాకు లకు కొంత ఊరట కలగ వచ్చు.
- ఇక ప్రైమరి మార్కెట్ల లో ఈ వారం సందడి చోటుచేసుకోనున్నది. ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థ జుబిలియేంట్ ఫుడ్ వర్క్స్ ఈ వారం ప్రైమరి మార్కెట్ల లో IPO విడుదల చేయనున్నది. ఈ సంస్థ డామీ నో పిజ్జ ఫుడ్ చైన్ పేరిట ఆహార ప్రియులకు సుపరిచితము . ఈ IPO కి భారి స్పందన కలిగే అవకాశం ఉంది. రూ. 135 -145 మధ్య శ్రేణిలో IPO , ఈ సోమవారం విడుదల కానున్నది. తదుపరి ఈ స్క్రిప్ట్ ప్రీమియం తో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్నందున ఆసక్తి గల మదుపరులకు , IPO లో పెట్టుబడి పెట్టవచ్చు.
- డెరి వేటివ్స్ పరంగా , నిఫ్టీ ఫ్యుచేర్స్ 2.20 పాయింట్ల ప్రీమియం వద్ద ముగిసింది. ఐతే నిఫ్టీ శుక్రవారం 7 పాయింట్ల దిద్దుబాటు జరగటం గమనార్హం. ప్రధానం గా 5100 -5400 మధ్య కాల్ రైటింగ్ , పుట్ రైటింగ్ జరుగుతోంది. ఐతే నిఫ్టీ కి 5300 పాయింట్ల వద్ద కీలక అవరోధం ఉంది
- ఈ వారం మన మార్కెట్ల పరంగా గురువారం విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాల మినహా ఇతర అంశాలు పెద్దగా ఏమీ లేనందున ప్రధానం గా మన మార్కెట్లు కంపనీల Q 3 ఫలితాలు, అంతర్జాతీయ పోకడల మీద దృష్టి కేంద్రీకరించ నున్నాయి.
- సోమవారం అమెరికా మార్కెట్ల కు సెలవ కారణం గా మన మార్కెట్లు మొదటి రెండు రోజులు మన మార్కెట్లు మందకొడిగా పయనించే ఆస్కారం ఉంది. ఈ వారం చైనా లో GDP మరియు CPI గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశాలను కూడా మార్కెట్లు గమనించ నున్నాయి. అంతర్జాతీయ కంపనీలు అమెరికా మార్కెట్ల లో విడుదల చేయనున్న ఫలితాలు కూడా మన మార్కెట్ల దృష్టి ని ఆకర్షించనున్నాయి. ఈ వారం కూడా టెక్నికల్ గా గత వారపు పరిధులే సెన్సెక్స్ న కు కీలకం కానున్నాయి . టెక్నికల్ గా ఈ వారానికి 17620-17785-17824-18000 పాయింట్లు కీలక అవరోధాలు కాగా ,17493-17237-17080-17002-పాయింట్ల స్థాయిలు ముఖ్య మద్దతులు. 50 రోజుల చలన సగటు ఐన 17080 పాయింట్లు అతిముఖ్యమైన మద్దత్తు గా పేర్కొనవచ్చు.
- ఈ వారం విడుదల కానున్న ఫలితాలు : 3i Infotech, Asian Paints, BASF India, Bharti Airtel, BHEL, Biocon, Container Corporation, Dr. Reddy's, Godrej Consumer, Gail India, GTL Infra, Grasim, HDFC, HDIL, HT Media, HCC, Hindustan Zinc, ICRA, ITC, ICICI Bank, Idea Cellular, Indiabulls Real Estate, Infotech Enterprises, Jaiprakash Associates, JSW Steel, Jubilant Organosys, Kotak Mahindra Bank, KPIT Cummins, L&T, Mindtree, MRPL, Mahindra Holidays, M&M, Mahindra Lifespaces, Maruti Suzuki, Neyveli Lignite, ONGC, Punj Lloyd, Piramal Healthcare, Philips Carbon Black, Praj Industries, Petronet LNG, Polaris Software, SRF, Sesa Goa, Shriram Transport, Sterlite Technologies, Shree Cements, Sun TV, Tata Power, Tech Mahindra, TVS Motor, United Spirits, Wipro, Welspun Gujarat, Welspun India, Yes Bank and Zee Entertainment.