- 14-01-2010
- మార్కెట్ నాడి
బ్లూమ్బెర్గ్ నిర్వహించిన అధ్యయ నం లో ప్రపంచ వ్యాప్తం గా ఉత్పత్తి రంగం పుంజు కోనున్నదని విశ్వాసం బలపడటం తో అప్పటివరకు నష్టాల తో పయనించిన అమెరికా మార్కెట్లు లాభాల బాట పట్టింది. మదుపర్లు సైతం స్టాక్ మార్కెట్లే తమకు లాభా ల పంట పండించ నున్నాయ ని విశ్వాసం తో ఉన్నారని అధ్యయనం లో తేలటం తో అమెరికా మార్కెట్లు 19 నెలల గరిష్ట స్థాయి కి ఎగబాకింది. నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి. జపాన్ మార్కెట్ల లో మేషీన్ టూల్స్ ఆర్డర్ల లో గణనీయ మైన వృద్ధి నమోదు కావటం కూడా ప్రపంచ వ్యాప్తం గా ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతున్నదని సంకేతాలు వెలవడటం తో జాపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. మన మార్కెట్ల పరంగా యోచన చేస్తే , పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అరికట్టేందుకు ప్రభుత్వం నిలువ ధాన్యాలను మార్కెట్ లో పంపిణి చేయాలని ఉత్తరువులు జారి చేసింది. అదే విధం గా, చెక్కర దిగుమతుల పై మరో తొమ్మిది నెలలు పాటు సుంకాన్ని రద్దు చేయనున్నట్లు ప్రకటించటం తో నా నాటికీ పెరుగుతున్న ద్రయ్వోల్బనాన్ని అరికట్టే విధం గా కసరత్తు చేస్తున్నది. ఐతే ,నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి . ప్రభుత్వం కనపరుస్తున్న ఆందోళన ని పరిశీలిస్తే, ఈ సారి ద్రవ్యోల్బణం భారీ పెరుగుదల నమోదు చెసే అవకాశం ఉంది. ఈ అంశం నేడు మార్కెట్లు నిశితం గా పరిశీలించ నున్నాయి. ప్రపంచ మార్కెట్లు కల్పించిన ఊతం తో నేడు మార్కెట్లు శుభారంభం చేసినా, మధ్యాన్నం తదుపరి , ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ దిశ ని నిర్దేషించ నున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17509
- అవరోధాలు: 17578-17620-17735
- మద్దత్తులు: 17498- 17373-17240