• 13-1-2010
  • మార్కెట్ రిపోర్ట్

యూరప్ మార్కెట్లు లాభాల తో ప్రారంభమవ్వటం తో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది. అమెరికా, ఆసియా మార్కెట్ల తిరోగమనంలో ర్యాలీని కొనసాగించడంతో నేడు నష్టాలతో పయనించిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి పుంజుకుంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 87 పాయింట్లు వృద్ధి చెంది, 17,509 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్ల బలపడి, 5,235 పాయింట్ల వద్ద నిలిచింది. ఐటీ వాటాల ట్రేడింగ్ బలపడటం సెన్సెక్స్ వృద్ధికి ప్రధాన కారణమైంది. ఇకపోతే.. మెటల్, రియాల్టీ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ క్షీణదశలో కొనసాగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రభావంతో సెన్సెక్స్ పురోగమనం వైపు ర్యాలీని మళ్లించింది . రాష్ట్రాల తో బడ్జెట్ ముందు జరపిన భేటి లో ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ , దేశ ఆర్ధిక అభివృద్ధి ఈ సంవత్సరానికి గాను 7.75% ఉండగలదని చెప్పటం వలన మార్కెట్ల లో సెంటిమెంట్ బల పడేందుకు కారణ మయ్యింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ౦.6 %, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.86 % లాభపడ్డాయి సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు ఐ. టి రంగం 3.84 % , టెక్ రంగం 2.81 % లాభపడగా ఆటో , బ్యాంకింగ్ రంగం 0.66% , 0. 6 %

చొప్పున నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు ACC 5.31 % ,TCS 5.23 % చొప్పున అత్యధిక లాభాలను ఆర్జించగా MNM 2.91 %, సన్ ఫార్మ 1.53 % నష్టపోయాయి.