- 12-1-2010
- మార్కెట్ రిపోర్ట్
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బాంబే స్టాక్ మార్కెట్‌కు ఊతమివ్వలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ మార్కెట్‌కు ఐఐపీ గణాంకాలు కలిసొస్తాయని ఆర్థిక నిపుణులు భావించారు. కానీ నవంబర్ నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాలు ఆశా జనకం గా ఉన్నప్పటికీ నూ , అనూహ్యమైన ఫలితాలు ఇన్ఫోసిస్ విడుదల చేసినప్పటికీ కూడా సెన్సెక్స్ తిరోగమనంలో ర్యాలీని కొనసాగించింది.దీంతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్ల మేర క్షీణించి, 17,422 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు పతనమై, 5210 పాయింట్ల వద్ద ముగిసింది.నవంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.7 శాతం పెరిగింది. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 2010 నాటికి 2.6 శాతం ఐఐపీ గణాంకాలు పెరిగి అవకాశం ఉందని కేంద్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మెన్ మాంటెక్ సింగ్ చెప్పారు. అయినప్పటికీ సెన్సెక్స్‌కు ఐఐపీ గణాంకాలు ఏ మాత్రం ఫలించలేదు.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు 1. 1 % చొప్పున నష్టపోయాయి.
నేడు ఐ. టి ఇండెక్స్ అత్యధికం గా 3.9శాతం లాభ పడగా, టెక్ ఇండెక్స్ 2.2 శాతం పెరిగింది. కాగా రియాలిటి రంగం 3.1 % , మెటల్స్ 2. 3 % నష్టపోయాయి
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు విప్రో , TCS 4.9 % చొప్పున లాభపడగా , DLF 3.9 % , RCOM 3. 5 % క్షీణించాయి.