• 12-1-2010
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్లు దిశాహీనం గా పయనించి మిశ్రమంగా ముగిసాయి. ఐతే చైనా దేశం యొక్క దిగుమతులు రికార్డు స్థాయిలో పెరగటం వంటి అంశాల వలన మార్కెట్లు కొంత నిలదొక్కుకున్నాయి. నేడు జపాన్ మార్కెట్ల లో విడుదల ఐన ట్రేడ్ గణాంకాలు పరిశీలిస్తే 490.6 బిలియన్ యన్ల TRADE SURPLUS నమోదు అయ్యింది.ఐనప్పటికీ , నేడు జపాన్ మార్కెట్లు నష్టాల బాట పట్టింది. కాగా ఇతర ఆసియా మార్కెట్లు మందకొడిగా ట్రేడ్ అవుతున్నాయి.

మన మార్కెట్ల పరం గా ఆలోచిస్తే, నేడు సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ డిసెంబర్ త్రి మాసిఅక ఫలితాలను విడుదల చేయనున్నది. ఈ అంశం మార్కెట్లు నిశితం గా పరిశీలించ నున్నాయి. ఈ ఫలితాలను బట్టి మార్కెట్లు ఇతర సాఫ్ట్ వేర్ సంస్థల పనితీరు పై అంచనాలు వేయనున్నది. ఐతే పెరుగుతున్న రూపాయి విలువ కారణం గా సాఫ్ట్ వేర్ కంపనీల మార్జిన్ లో క్షీణత నమోదు అయ్యే అవకాశం ఉంది. పైగా CREDIT SUISSE సంస్థ మన దేశం లో సాఫ్ట్ వేర్ కంపనీ వాటాలు ఇతర మార్కెట్ల తో పోలిస్తే ప్రియం గా ఉన్నాయని, ఆదాయం తో పోల్చి చూస్తె సెన్సెక్స్ ఇప్పటికే తారా స్థాయి లో ఉన్నదని తెల్చిచేప్పటం , సెన్సెక్స్ నకు OVERWEIGHT అని రేటింగ్ ఇవ్వటం - మన మార్కెట్ల లో BEARS కి ఉత్సాహం కలిగించ నున్నది. ఐతే మన దేశ ఎగుమతులు 15 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవటం శుభసూచకం. ఈ అంశం వలన మన దేశం 7.75 % వృద్ధిని ని నమోదు చేయగలదన్న అంచనాలకి మరింత బలం చేకూర్చనున్నది.

నేటి మార్కెట్ పయనం ప్రధానం గా ఇన్ఫోసిస్ ఫలితాలు నిర్దేశించ నున్నాయి. అంచనాలను మించి ఫలితాలు వెలువడితే మార్కెట్లు లాభాపడనున్నాయి . కానిపక్షం లో అంతర్జాతీయ మార్కెట్ల కి అనుసంధానం గా మిశ్రమంగా పయనించ వచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17527
  • అవరోధాలు: 17578-17620-17735-17824
  • మద్దత్తులు:17493-17373-17240-17124