- 13-1-2010
- మార్కెట్ నాడి
నిన్న చైనా సెంట్రల్ బ్యాంకు వృద్ధి రేటు ని క్రబద్దికరణ చేసేందుకు గాను వడ్డీ రేటుని పెంచే దిశా గా కసరత్తు చేసింది. దీనితో ఉద్దిపణలు ఉపసంహరణ దిశగా చైనా చర్యలు తీసుకోవటం తో , ప్రపంచ మార్కెట్లు బెంబేలెత్తి పోయాయి. ఉద్దిపణలు లేకుండా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కోలుకోవటం అసంభవం అనే అంచనాల తో అమెరికా మార్కెట్లు గత రాత్రి భారి గా కోల్పోయాయి. దీనితో గత కొన్ని రోజులు గా కొనసాగుతున్న కమోడిటి , ముడి చమురు ల లో ని ర్యాలి కి బ్రేక్ పడింది. చైనా బ్యాంక్ ఈ విధం గా ఒకే సారిగా 50 బేసిస్ పాయింట్ల కీలక వడ్డీ రేటు ని పెంచి ,అక్కడి బ్యాంకు ల అప్పు ఇచ్చే స్థోమత ని కుదించటం ఊహించని పరిణామం గా మార్కెట్లు పరిగణించటం తో , నేడు ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ అంశం వలన మార్కెట్లు కూడా నేడు నష్టపోయే అవకాశం ఉంది. భారత ఉత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం కూడా బహుశా మార్కెట్లకు నేడు ఊరట కలిగించక పోవచ్చు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17422
- అవరోధాలు: 17493-17578-17620-17735
- మద్దత్తులు:17373-17240-17124