• 11-1-2010
  • మార్కెట్ రిపోర్ట్
సానుకూల ప్రపంచ మార్కెట్లు ఉదయం అందించిన చేయూత మన మార్కెట్లు ముగింపు దశ లో నిలబెట్టుకోలేక పోయాయి. దీనితో ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు క్షీణించి, 17,526 పాయింట్ల వద్ద ముగిసింది.
ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 17500 పాయింట్ల వరకు క్షీణించింది. ఇది మేము ఉదయం సూచించిన కీలక మద్దత్తు ఐన 17493 పాయింట్లకి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం .
అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం కేవలం మూడు పాయింట్ల స్వల్ప లాభంతో 5247 పాయింట్ల వద్ద నిలిచింది.దేశీయ వాటాల ట్రేడింగ్ పడిపోవడం సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతున్నప్పటికీ
రిలయన్స్ వాటాల లో చోటు చేసుకున్న బలహీనత కారణం గా ఆయిల్, గ్యాస్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం తో సెన్సెక్స్ నష్టపోయింది. నేటి ట్రేడింగ్ లో 3.3 కోట్ల రిలయన్స్ ట్రెజరీ వాటాలు రూ.1050 చొప్పున బ్లాక్ డీల్ లో అమ్మకం జరగటం తో ఈ కౌంటర్ 1.8 % నష్టపోవటం నేడు మార్కెట్ల లో భల్లుకాలకి ( BEARS) అవకాశం కల్పించినట్లయింది.
నేడు మిడ్ క్యాప్ రంగం 0.90 % , స్మాల్ క్యాప్ రంగం 1.8 % లాభపడ్డాయి. సేక్తోరాల్ ఇండెక్స్ ల లో నిన్నటి " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో మేము సూచించిన విధంగా రియాలిటి రంగం 2.6 % మేరకు ఎగబాకింది. కాగా టెక్ ఇండెక్స్ 1.08 % లాభపడింది. నేటి ట్రేడింగ్ లో కేవలం చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ నష్టపోయింది. ఈ ఇండెక్స్ 1.10 % నష్టపోయి అందరిని నిరాశ పరిచింది.
ఇక సెన్సెక్స్ స్టాకు ల ను పరిశీలిస్తే DLF , JP ASSOCIATES 2.3 % లాభపడ్డాయి. కాగా రిలయన్స్ 1.8 % , విప్రో 1 % నష్టపోయాయి.