- 11-1-2010
- మార్కెట్ నాడి
శుక్రవారం అమెరికా మార్కెట్లు , దయనీయమైన నిరుద్యోగ గణాంకాల తో బావురుమన్నప్పటికీ , పెరిగిన ఇంవెంట్త్రీస్ కారణం గా మరల కోలుకున్నాయి. నేడు చైనా మార్కెట్ల ప్రభావం వలన ఆసియా మార్కెట్లన్నీ కూడా జోరు గా ట్రేడ్ అవుతున్నాయి. చైనా లో సానుకూల ట్రేడ్ గణాంకాలు విడుదల కావటం, ముడిచమురు వినియోగం లో పెరుగుదల మున్నగు అంశాల తో కామోడిటి లు , మెటల్స్ భారిగా లాభాపడుతున్నాయి. ఈ గణాంకాలు విడుదల అయిన వెంటనే , ముడి చమురు బ్యారెల్ కి $ 83 వరకు ఎగబాకింది. సింగపూర్ నిఫ్టీ స్టాక్ ఫ్యు చేర్స్ కూడా ౦. 4 % లాభాన్ని నమోదు చేసాయి.
సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన మన మార్కెట్లు కూడా నేడు కొంత బలం గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పైగా ఆర్థిక మంత్రి మన దేశాభి వృద్ధి పదిలం గా ఉండనున్నదని భరోసా ఇవ్వటం కూడా మార్కెట్లకు మరింత ఉత్సాహం కలిగించ నున్నది . కాగా బడ్జెట్ , ఫిబ్ర వరి 26 న ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించటం వలన కూడా , మార్కెట్లు బడ్జెట్ అంచనాల పైకూడా నేటి నుండి కసరత్తు చేయనున్నది. అదే విధం గా ప్రభుత్వ రంగ సంస్థల లో పెట్టుబడులను ఉపసంహరించ నున్నట్లు , ముందుగా ntpc పై దృష్టి సారించానున్నట్లు మంత్రి చేసిన ప్రకటన కూడా , ఈ కౌంటర్ లో కొంత సంచలం సృష్టించవచ్చు. మెటల్స్ వాటాలు కూడా నేడు భారి గా లాభ పడే అవకాశం ఉంది.
సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు శుభారంభం చేసే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17541
- అవరోధాలు: 17578-17620-17735-17824
- మద్దత్తులు:17493-17373-17240-17124