- 31-12-2009
- మార్కెట్ నాడి
2009 సంవత్సరం లో చివరి సారి గా మార్కెట్లు నేడు ట్రేడ్ కానున్నాయి. ఈ సందర్భంగా , మన మార్కెట్ల లో నేడు F & O ముగింపు కూడా చోటుచేసుకోనున్నది.
గత రాత్రి అమెరికా మార్కెట్లు తొలుత ఫేడ్ , ఉద్దిపణలు ఉపసంహరించవచ్చని అనుమానాల తో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఐతే ఉత్పత్తి గణాంకాల కి సంబంధించిన చికాగో ఇండెక్స్ 60 పాయింట్లకు ఎగబాకటం తో మార్కెట్లు పుంజుకొని మరల ఫ్లాట్ గా ముగియగాలిగాయి. ఈ రోజు రాత్రి కి విడుదల కానున్న నిరుద్యోగ గణాంకాల అంచనాలు కూడా మార్కెట్లు మందకొడి గా ట్రేడ్ అయ్యేందుకు కారణమయ్యింది.
అమెరికా మార్కెట్ల లో చోటుచేసుకున్న బలహీనత నేడు ఆసియా మార్కెట్ల లో కూడా కనవస్తోంది. జపాన్ లో జపాన్ ఎయిర్వేస్ దివాలా తీయనున్నటు వచ్చిన వార్త కూడా మార్కెట్ సెంటిమెంట్ ని బలహీన పరుస్తున్నాయి. కాగా “ మూడి “ ఏజెన్సి , జపాన్ బడ్జెట్ లోటు ని తగ్గించుకొనక పొతే , దేశం యొక్క రేటింగ్ ని తగ్గించనున్నట్లు చేసిన ప్రకటన కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. కాగా చైనా , అమెరికా కి ఎగుమతి చేస్తున్న స్టీల్ పైపుల పై అదనపు డ్యూటీ విధించనున్నట్లు తీసుకున్న నిర్ణయం పై చైనా మార్కెట్లు, తద్వారా కమోడిటిలు ( రాగి మినహా ) బలహీనపడుతున్నాయి. బంగారం కూడా నాలుగు రోజుల ర్యాలి కి స్వస్తి పలకటం గమనార్హం.
ఇక మన మార్కెట్లను పరిశీలిస్తే, కేంద్రం 9 విదేశీ ప్రత్యక్ష పెట్టుపడుల కు పచ్చ జండా ఊపటం మన మార్కెట్ల కు కొంత ఊరట కలిగించే అంశం. ఆర్ధిక సిఫార్సుల లో ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపనీలకు ఇక మీదట సబ్సిడీని ఆయిల్ బాండ్ల రూపం లో కాక ధన రూపేనా మాత్రమె ఇవ్వాలన్న సూచన వలన ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థల లో నేడు కొంత సంచలనం చోటు చేసుకునే అవకాశం ఉంది. నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా మార్కెట్లు నిశితం గా పరిశీలించానున్నాయి.
ఈ నేపధ్యం లో, బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్ల లో కూడా నిన్నటి బలహీనత కనపడే అవకాశం లేకపోలేదు. ఐతే , నేడు మార్కెట్ల దిశ ప్రధానం గా డెరివేటివ్స్ ముగింపు పై ఆధార పడనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17344
- అవరోధాలు: 17373-17493-17578-17620
- మద్దత్తులు:17240-17124-17002-16978