• 04-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

వారాంతం లో నేడు మార్కెట్లు సుమారు అర శాతం నష్టాలను నమోదు చేసాయి. దీనితో నేడు సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 17101 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి , 5109 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో బలహీనం గా ప్రారంభమైన మార్కెట్లు , ఇతర ఆసియా మార్కేట్లని అనుకరిస్తూ , జపాన్ ఉద్దీపన ప్యాకేజి ల వార్త పై కొంత బలపడ్డాయి. ఐతే , జపాన్ కాబినెట్ లో సామరస్యం కుదరక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించక పోవటం తో ఆసియా మార్కెట్లు మరల క్షీణించాయి. మన మార్కెట్ల లో కూడా , ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం తో సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్, ICICI బ్యాంక్ కోల్పోయే సరికి మార్కెట్లు నష్టపోయాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం లాభపడటం విశేషం.

సేక్టరాల్ ఇండెక్స్ ల ను పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ లో ఆటో , బ్యాంకింగ్ రంగం 1.5 %, 1.2 % చొప్పున క్షీణించాయి. కాగా హెల్త్ కేర్ 1.2 %, టెక్ ఇండెక్స్ 0.4 % లాభపడ్డాయి. సెన్సెక్స్ స్టాకు ల లో భారతి అయిర్ టెల్ 1 %, TCS 0.8 % లాభాలను ఆర్జించాయి. కాగా మారుతి 2.4 %, MNM 2 .2% నష్టపోయాయి .