06-12-2009

  • మార్కెట్ ముందు చూపు
  • (7-12-2009 నుండి 11-12-2009 వరకు )

దుబాయి ఉదంతం ప్రస్తుతానికి పక్కకు పెట్టి , గత వారం అరబ్ మార్కెట్లు మినహా ప్రపంచ మార్కెట్లు లాభ పడ్డాయి. క్రమంగా మెరుగుపడుతున్న ఆర్ధిక పరిస్థితి కారణం గా , మార్కెట్లు పడుతున్నప్పుడల్లా చోటు చేసుకుంటున్న కొనుగోళ్ళ నేపధ్యం లో మన మార్కెట్లు గత వరం నిలకడ గా ట్రేడ్ అయ్యాయి. గత వారం నిఫ్టీ 167 పాయింట్లు లాభపడగా ,సెన్సెక్స్ 470పాయింట్లు ఎగబాకింది. ఇవి 3.38 %, 2.82 % చొప్పున వృద్ధిని సాధించాయి. అంచనాలను మించి Q2 GDP గణాంకాలు 7.9 % వృద్ధిని నమోదు చేస్తూ విడుదలకావటం తో మన మార్కెట్ల ఉత్సాహం నెలకొని లాభాలను ఆర్జించింది. భారి గా చోటు చేసుకున్న వాహనాల అమ్మకాలు, సిమెంట్ ఎగుమతులు మున్నగు సానుకూల అంశాల తో మదుపర్లు ఈ కౌంటర్ల పట్ల ఆకర్షితులయ్యారు.

అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన నిరుద్యోగ గణాంకాలు స్వల్పంగా తగ్గుతూ, స్థిరం గ ఉండటం కూడా మార్కెట్ల సెంటిమెంట్ బలహీనం కాకుండా కాపాడాయి .ఐతే మన దేశా మార్కెట్ల లో ఈ ఏడాది FII ల ఆగమనం గడిచిన ఆరు సంవత్సరాల లో అతి తక్కువగా నమోదు కావడం FII ల అప్రమత్త ధోరణి ని సూచిస్తున్నాయని చెప్పవచ్చు. పైగా ప్రతుతానికి దుబాయి ఉదంతం ప్రస్తుతానికి ప్రపంచ మార్కెట్లు పెద్దగా పట్టించుకో నప్పటికీ, మన మార్కెట్ల విషయం లో ఇదే నిర్భయత్వం రానున్న రోజుల లో కనవస్తుందని చెప్పలేము. మన దేశానికి సంబంధించిన ఎగుమతులు చాలా మటుకు దుబాయి ప్రాంతానికే జరుతాయని, NRI ల ద్వారా మన దేశానికి వచ్చే ఆదాయం అధిక శాతం ఈ ప్రాంతం నుండే వస్తున్నాయని మనం విస్మరించ కూడదు. RBI అధ్యయనం విడుదల అయినప్పుడు ఈ అంశం ప్రాధాన్యత సంతరించు కో నున్నది. అదే విధం గా ద్రవ్యోల్బణం కట్టు దిట్టం చేసే ప్రయత్నం లో రిజర్వు బ్యాంక్ వద్దే రేటు ని పెంచక తప్పదు, ముఖ్యం గా రానున్న రోజుల లో , పెరుగు తున్న ఆహార ధాన్యాల ధరలను అరికట్టే ప్రయత్నం లో ప్రభుత్వం చర్యలు అనివార్యం కానున్నాయి. గత వారం విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాల లో ఆహార ధాన్యాల ధరలు 17.4 % ఎగబాకటం , అటు పభుత్వం, రిజర్వు బ్యాంకు తో పాటు, ఇటు సామాన్య ప్రజానికానికి కూడా ఆందోళన కలిగించే అంశం .

ఈ వారం రాబోయే ముఖ్య అంశాలని పరిశీలిస్తే, ఈ వారం 11 వ తేదిన ప్రభుత్వం, అక్టోబర్ మాసపు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదల చేయనున్నది. అంతర్జాతీయం గా , అమెరికా మార్కెట్ల కు సంబంధించిన రిటైల్ ( చిల్లర ) అమ్మకాల గణాంకాలు కూడా ఇదే రోజున విడుదల కానున్నాయి. సోమవారం అమెరికా ఫెడ్ అధ్యక్షులు బెన్ బర్నంకే ప్రసంగించనున్నారు. ఈ అంశాన్ని కూడా మార్కెట్ వర్గాలు ఆసక్తి తో పరిశీలించ నున్నాయి.

ప్రైమరీ మార్కెట్ల లో JSW ENERGY, GODREJ PROPERTY ఐ. పి. ఓ లు మార్కెట్లను తాకనున్నాయి. కాబట్టి ఈ మార్కెట్ల లో ఈ వారం సందడి చోటు చేసుకోనుంది.

టెక్నికల్ గా పరిశీలిస్తే , చార్ట్ల లో డబల్ టాప్ కనవస్తోంది. కాబట్టి సెన్సెక్స్ గత గరిష్ట స్థాయి ఐన 17493 పాయింట్లను నిర్వివాదం గా దాటితే తప్ప , మార్కెట్లు లాభాల బాట లో ఉన్నాయని గట్టిగా చెప్పలేము. గత వారం సెన్సెక్స్ నకు 15 రోజుల సంచలన సగటు ( DMA) కీలక మద్దత్తు గా వ్యవహరించింది. ఈ వారం 60 DMA ఐన 16696 పాయింట్ల మద్దత్తు స్థాయి అతి కీలక మద్దతు . 16498 ( 75 DMA) , 16030 పాయింట్ల స్థాయి ఇతర కీలక మద్దతులు. కాగా సెన్సెక్స్ నకు 16196-15992-15790 చోపుకోదగ్గ ఇతర మద్దత్తు స్థాయిలు. ఈ వారం 17240-17490-17620-17824 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు .ఈ వారం స్మాల్ క్యాప్ రంగం, క్యాష్ మార్కెట్ లో స్టాకు ల వారిగా ట్రేడ్ చేసుకోవటం ఉత్తమం .