• 04-12-2009
  • మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన సర్వీసు రంగం గణాంకాలు ఊహించని విధం గా క్షీణించటం తో అక్కడి స్టాకులు ప్రతికూలం గా స్పందించి నష్టపోయాయి. ఇప్పటికే గరిష్ట స్థాయి కి ఎగసిన ఆసియా మార్కెట్లు కూడా ,ఈ ప్రభావం వలన , నష్టాలను చవిచూస్తున్నాయి. ఆసియా మార్కెట్ల లో ప్రధానంగా మైనింగ్ , స్టీల్ , బ్యాంకింగ్ మరియు రియల్ ఎస్టేట్ స్టాకు లు అమ్మకాలవత్తిడికి గురి అవుతున్నాయి. ఐతే నేడు జపాన్ లో మొదటి సారిగా ఆర్ధిక ఉద్దేపన ప్యాకేజీలు ప్రకటించే సూచనలు ఉన్నాయి కాబట్టి , నేడు జపాన్ మార్కెట్లు ముగిసే సమయానికి కొంత కోలుకునే అవకాశం ఉంది. ఈ ఉద్దేపన ప్యాకేజి వివరాలను బట్టి , ఇతర ఆసియా మార్కెట్లు కూడా కొంత పుంజుకునే అవకాశం లేకపోలేదు.
ఈ కారణాల వలన నేడు మన మార్కెట్లు కొంత ఒడిదుడుకుల తో ప్రారంభ మయ్యి , జపాన్ మార్కెట్ ని అనుసరించి , తదుపరి ట్రేడ్ కానున్నాయి. ఐనప్పటికీ, ఇప్పటికే తారా స్థాయి లో చేరుకున్న మన మార్కెట్ల లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. పైగా , నేడు వారాంతం కనుక , అమ్మకాల వత్తిడి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ రాగల రోజుల లో కీలక వడ్డీ రేటు ని పెంచ వచన్న అంచనాల తో వడ్డీ రేటు -swaps లో భారి పెరుగుదల నమోదు కావటం గమనార్హం. కాబట్టి నేటి ట్రేడింగ్ లో జపాన్ అంశం మినహాయిస్తే , మార్కెట్లు బలహీనపడే ఆస్కారాలే ఎక్కువగా ఉన్నాయి.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17185
  • అవరోధాలు: 17198-17240-17373-17490
  • మద్దత్తులు:17124-17002-16978-16844