02-02-2009 ::
- మార్కెట్ రిపోర్ట్
ట్రేడింగ్ బలహీనత కారణంగా బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఈ వారం ప్రారంభం నుంచి లాభాలతో దూసుకెళ్లిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ నేడు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొని లాభ, నష్టాలతో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్లు క్షీణించి, 17,169 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 1.25 పాయింట్లు లాభపడి, 5,123 పాయింట్ల వద్ద ముగిసింది.
విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, అంతర్జాతీయ సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం వంటి కారణాలు సెన్సెక్స్ తిరోగమనం వైపు పయనింప జేసాయి. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.9శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.87 శాతం లాభపడటం విశేషం.
సేక్టరాల్ ఇండెక్స్ల లో నేడు రియాలిటి రంగం , ఆటో రంగం 1.9 %, 1.3 % చొప్పున లాభపడ్డాయి. ముఖ్యం గా DLF సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ కానున్నదన్న వార్త, టాటా మోటర్స్ నవంబర్ మాసానికి గాను Y-O-Y 65 % వృద్ధిని నమోదు చేయటం వలన , ఈ ఇండెక్స్ లు లాభాపడెందుకు ముఖ్య కారణమయ్యాయి. కాగా నేడు
పవర్ , FMCG రంగాలు 0.5 % చొప్పున బలహీనపడ్డాయి. ఐతే నేటి ట్రేడింగ్ లో ABG షిప్ యార్డ్ సంచలనం సృష్టించింది. ABG షిప్ యార్డ్ , గ్రేట్ ఆఫ్ షోర్ కంపనీ లోని తమ వాటాని అమ్మివేయనున్నట్లు ప్రకటించటం తో గత ఆరు మాసాలుగా భారతి షిప్ యార్డ్ , ABG షిప్ యార్డ్ మధ్య గ్రేట్ ఆఫ్ షోర్ పై ఆధిపత్యం కొరకై కొనసాగుతున్న పోటి కి తెరపడింది. ఈ కారణం గా ఈ రెండు కంపనీల వాటాలు కూడా భారి గా లాభ పడ్డాయి. ఇక సెన్సెక్స్ వాటాలను పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ లో టాటా మోటర్స్, DLF 4.1 % ,3.7 % చొప్పున లాభపడ్డాయి. కాగా సన్ ఫార్మ , HDFC 2.9 %, 1.9 % చొప్పున నష్టపోయాయి.