- 3-12-2009
- మార్కెట్ నాడి
నిన్న స్థిరంగా ముగిసిన మన మార్కెట్లు నేడు తదుపరి దిశ కోసం మరొకసారి ప్రపంచ మార్కెట్ల పై దృష్టి సారించ నున్నాయి . గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా ఫ్లాట్ గా ముగిసాయి. అమెరికా లో విడుదల ఐన BEIGE BOOK ప్రకారం అక్కడి ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా ఉందని గణాంకాలు తెలియవచ్చాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం నిలకడగా ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి లాగే, నేడు కూడా అమెరికా డాలర్ బలహీన పడుతున్న నేపధ్యం లో , బంగారం ధరల లో కనవస్తున్న జోరు నేడు కూడా కొనసాగవచ్చు. పైగా అమెరికా డాలర్ తో పోల్చి చూస్తే మన దేశపు రూపాయి విలువ , రాగల 16 మాసాల లో 41.81 కి బలపడవచ్చని అంచనాలు వెలువడటం గమనార్హం. అదే విధం గా రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని ఈ మాసం లో పెంచే అవకాశం లేదనన్న అంచనాలు కూడా వెలవడటం తో నేడు మన మార్కెట్లు స్థిరం గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐతే పెరుగుతున్న ద్రవోల్బణం , రానున్న రోజుల లో మార్కేట్లని ప్రభావితం చేయనున్నది. మార్కెట్లు దిశా హీనం గా కొనసాగే అవకాశం ఉన్నందున నేడు స్టాకు ల వారిగా ట్రేడ్ చేసుకోవటం ఉత్తమం.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17169
- అవరోధాలు: 17198-17240-17373-17490
- మద్దత్తులు:17124-17002-16978-16844