• 2-12-2009
  • మార్కెట్ నాడి

అమెరికా ఫెడ్ రిజర్వు పదవి కి బెన్ బెర్నంకే రెండవ దఫా , అమెరికా సెనేటర్ల చే ఎన్నుకోబడటం , అమెరికా లో అతి తక్కువ సంఖ్య లో ఉద్యోగాలు కోల్పోయాయన్న గణాంకాలు విడుదల కావటం మున్నగు అంశాల నడుమ గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల లో ముగిసాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేయటం తో నేడు ప్రపంచ మార్కెట్ల లో నెలకొనివున్న జోరు మన మార్కెట్లను కూడా సానుకూలం గా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

దుబాయి వరల్డ్ సంక్షోభం అనంతరం మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకోవటం తో , ప్రపంచ విపణి లో బంగారం ధరలకి మరల రెక్కలోస్తున్నాయి. తరుగుతున్న అమెరికా డాలర్ విలువ కూడా ఇందుకు ఉపకరిస్తోంది. ఈ నేపధ్యం లో నేడు ప్రపంచ మార్కెట్ల లో ఇతర కామోడిటి లు కూడా బలపడుతున్నాయి.

మన మార్కెట్ల ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే, అక్టోబర్ నెలకి సంబంధించిన ఎగుమతుల లో క్షీణత నమోదు కావటం కొంత నిస్పృహ కలిగించ వచ్చు. దీనితో వరుసగా 13 వ నెలకి గాను ఈ తగ్గుదల నమోదు కావటం తో , అంతర్జాతీయ డిమాండ్ కంటే కూడా మన పరిశ్రమలకి దేశవాళి డిమాండ్ మరింత కీలకం కానున్నది. పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరల కారణం గా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్యా , కీలక వడ్డీ రేటు లో పెంపుదల ఆహార ధాన్యాల ధరల పైన ఆధారపడ నున్నదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ చేసిన ప్రకటన కీలకం. ఇందుకు గాను, నిన్న పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి , వ్యవసాయ ఉత్పత్తులను పెంచే దిశలో భారి పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించటం తో నేడు వ్యవసాయ రంగానికి చెందిన స్టాకు ల లో కొంత స్పెకులేషన్ చోటుచేసుకోవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17198
  • అవరోధాలు: 17240-17373-17490
  • మద్దత్తులు:17124-17002-16978-16844