• 7-12-2009
  • మార్కెట్ నాడి

గత శుక్రవారం మధ్యాన్నం తదుపరి అమ్మకాల వత్తిడి కి గురి అయిన మన మార్కెట్లు నేడు ప్రపంచ మార్కెట్ల సానుకూల వాతావరణ నేపధ్యం లో మరొక సారి గరిష్ట స్థాయి లో వున్న అవరోధాన్ని చేదించే ప్రయత్నం చేయనున్నది. గత రెండు నెలలు గా సెన్సెక్స్ 17300 పాయింట్ల వద్ద చేరుతున్నప్పుడల్లా ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవటం విదితమే. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు సానుకూల నిరుద్యోగ గణాంకాలు విడుదల కావటం తో నిలదొక్కుకున్నాయి. నేటి జపాన్ మార్కెట్ల లో నవంబర్ మాసానికి గాను విడుదల ఐన అసెట్ విలువలు పెరిగినట్లు గణాంకాలు విడుదల కావటం తో లాభాల లో పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియా మార్కెట్లు క్షీణిస్తున్న కంస్ట్రక్షన్ల కారణం గా నష్టాలను చవిచూస్తున్నాయి. కాగా ఇతర ఆసియా మార్కెట్లు మిశ్రమంగా పయనిస్తున్నాయి.

నేటి ట్రేడింగ్ లో భల్లుకాలకి ( bears) దుబాయ్ హోల్డింగ్ సంస్థ ప్రధాన ఆయుధం కానున్నది . రెండు వారల క్రితం దుబాయి వరల్డ్ పంధాలో నే దుబాయి హోల్డింగ్ అనే మరొక సంస్థ చేతులెత్తేసే ప్రక్రియ లో ఉన్నదన్న వార్త నేడు మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. ఈ అంశం పై మరిన్ని వివరాలు నేటి మధ్యాన్నం దుబాయి మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి అందనున్నాయి. కాబట్టి మదుపర్లు అప్రమత్తత తో వ్యవహరించాలి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17101
  • అవరోధాలు: 17198-17240-17373-17490
  • మద్దత్తులు:17002-16978-16844