• 07-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

పూర్వార్థం లో ఫ్లాట్ గా ట్రేడ్ ఐన మార్కెట్లు , మధ్యాన్నం తదుపరి నష్టపోయాయి. దీనితో నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 5067 పాయింట్ల వద్ద ముగియగా , సెన్సెక్స్ 118 పాయింట్లు కోల్పోయి 16983 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నేటి ఉదయం మేము సూచించిన కీలక స్థాయి ఐన 16978 పాయింట్లకి అత్యంత దగ్గరలో ఉండటం విశేషం

నేటి ట్రేడింగ్ లో సానుకూల ప్రపంచ మార్కెట్లు కొంత సహకరించినప్పటికీ మన మార్కెట్ల లో గరిష్ట స్థాయి లో చోటు చేసుకుంటున్న ప్రాఫిట్ బుకింగ్ కారణం గా నేడు కూడా మార్కెట్లు నష్టపోయాయి. నేటి ట్రేడింగ్ లో మెటల్స్ వాటాల లో ఆద్యంతం భారి అమ్మకాలు కొనసాగాయి. దీనితో ఈ రంగం అత్యధికం గా 3.29 % క్షీణించింది . కాగా రియాలిటి స్టాకు ల పతనం వలన రియాలిటి ఇండెక్స్ కూడా 2.44 % మేరకు నష్టాలను చవిచూసింది. నేటి ట్రేడింగ్ లో క్యాపిటల్ గూడ్స్ రంగం 0.69 %, టెక్ ఇండెక్స్ ౦.34 % స్వల్ప లాభాలను నమోదు చేసాయి.

నేడు మిడ్ క్యాప్ రంగం 0.79 %, స్మాల్ క్యాప్ రంగం ౦.34 % చొప్పున నష్టపోయాయి.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, స్టర్ లైట్ ఇండస్ట్రీస్ , టాటా స్టీల్ 4.2 %, 3.4 % చొప్పున నష్టపోయాయి. కాగా భారతి అయిర్ టెల్ 2.1 %, HDFC 1.2 % మేరకు లాభాలను ఆర్జించాయి.