• 30-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ముగిసింది. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం ఆశాజనకంగా ముగిసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్‌కు బుధవారం చుక్కెదురైంది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 57 పాయింట్లు క్షీణించి 17,343 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్పంగా పతనమై, 5,169 పాయింట్ల వద్ద నిలిచింది. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, నిరాశజనక సంకేతాలతో సెన్సెక్స్ నష్టాలను నమోదు చేసుకుంది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.33 శాతం లాభపడటం విశేషం .

సేక్టరాల్ ఇండెక్స్ ల లో కన్సుమేర్ డూరబుల్స్ 1.45 % , రియాలిటీ 0.55 % మేరకు లాభపడగా , FMCG 1.12 %, మెటల్స్ 0.77 % క్షీణించాయి.
సెన్సెక్స్ షేర్ల లో నేడు రిలయన్స్ ఇన్ఫ్రా 1.59 %, ACC 1.29 % స్వల్పలాభాలను నమోదు చేయగా, ITC 2.15 %, హీరో హోండా 2.08 % నష్టపోయాయి.