• 30-12-2009
  • మార్కెట్ నాడి

అమెరికా మార్కెట్ల లో వెలువడిన మిశ్రమ ఫలితాల నేపధ్యం లో అక్కడి మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. కన్సుమెర్ విశ్వాస గణాంకాల సూచీ 52.9 మేరకు పెరగటం అమెరికా మార్కెట్లకు ఊరట కలిగించినప్పటికీ , హోం ప్రైస్ సూచీ 7.3 మేరకు పడిపోవటం తో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా , అమెరికా నుండి స్పష్టమైన దిశ కొరవడటం తో పలు స్థానిక కారణాల వలన బలహీనం గా పయనిస్తున్నాయి.

మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే, రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జనవరి లో రిజర్వు బ్యాంక్ సమావేశం లో ఆర్ధిక వృద్ధి తో పాటు పెరుగతున్న ద్రవ్యోల్బణం పై కూడా ప్రత్యెక దృష్టి సారించనున్నట్లు ప్రకటించటం తో రిజర్వు బ్యాంక్ CRR ని పెంచే అవకాశం మరింత గా పెరిగింది. ఈ అంశాన్ని మార్కెట్లు పరిగణ న లో తీసుకునే అవకాశం ఉంది. పైగా మార్కెట్లు ప్రస్తుతం గరిష్ట స్థాయి లో ఉండటం, ప్రపంచ మార్కెట్లు మందకొడి గా పయనించటం వంటి అంశాలను పరిశీలిస్తే, నేడు మన మార్కెట్లు స్వల్ప అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే అవకాశం ఉంది. రేపు ముగియ బోయే F & O ముగింపు కూడా మార్కెట్లను మరింత ఆటు పొట్ల కు గురిచేసే అవకాశం ఉంది.

టెక్నికల్ గా సెన్సెక్స్ 17493 అవరోధం దాటితే గాని , మార్కెట్లు పుంజుకునే అ వకాశం లేదు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17401
  • అవరోధాలు: 17493-17578-17620
  • మద్దత్తులు:17373-17240-17124-17002