• 29-12-2009
  • మార్కెట్ రిపోర్ట్
మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 40 పాయింట్లు వృద్ధి చెంది, 17,401 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 9 పాయింట్ల స్వల్ప లాభం తో 5188 పాయింట్ల వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ర్యాలీ, ట్రేడింగ్‌ను కొనసాగించడం సెన్సెక్స్ వృద్ధికి ఊతమిచ్చింది. ఇంకా మదుపుదారులు విదేశీ కొనుగోళ్లపై దృష్టి మళ్లించడం, దేశీయవాటాల కొనుగోళ్లు సైతం పుంజుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ నేడు పూర్తిగా వృద్ధిబాటలో పయనించింది.
నేడు గ్యాప్ అప్ తో , మా అంచనాలకి అనుగుణం గా ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం లాభాల లో పయనించాయి. నేడు సెన్సెక్స్ కనిష్టం గా 17373పాయింట్లు నమోదు చేయగా , గరిష్టం గా 17486 పాయింట్లను నమోదు చేసింది. ఐతే, ఈ రెండు స్థాయిలు కూడా మేము ఉదయం సూచించిన కీలక స్థాయిలు ఐన 17373 , 17493 పాయింట్ల కు అత్యంత సమీపం గా ఉండటం విశేషం. నేటి ట్రేడింగ్ లో , మేము ఉదయం సూచించిన విధం గా మెటల్స్ , కామోడిటి లు బాగా రానించాయి.
సెన్సెక్స్ లాభాలను నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్‌కు చెందిన 2901 వాటాల్లో 1859 వాటాలు లాభదాయకం కొనసాగాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.5 శాతం , స్మాల్ క్యాప్ రంగం 1.16 శాతం మేరకు లాభపడ్డాయి. సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు మెటల్స్ ఇండెక్స్ 0.9 % , కన్సుమర్ డ్యురబుల్స్ 1 % మేరకు లాభపడ్డాయి. కాగా హెల్త్ కేర్ రంగం 1.4 %, ఐ. తి ఇండెక్స్ 0.6 % నష్ట పోయాయి.
నేటి సెన్సెక్స్ స్టాకు ల లో రిలయన్స్ ఇన్ఫ్రా 2.8 %, హిందాల్కో 2.7 % మేరకు ఎగబాకాయి. కాగా విప్రో 1.8 %, సన్ ఫార్మ 1.6 % బలహీనపడ్డాయి .