• 30-11-2009 : 6:20 PM
  • మార్కెట్ రిపోర్ట్
జపాన్ బ్యాంకు ఆర్ధిక వ్యవస్థ లో మరొక $ 115 బిల్లియన్లని అందుబాటులోకి తీసుకురానున్నదని ప్రకటించటం తో ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. అంతే కాక చైనా లో గత ఐదు సంవత్సరాల లో అత్యధికం గా ఉత్పత్తి రంగం వృద్ధి ని నమోదు చేయటం తో మార్కెట్ల సెంటిమెంట్ బలపడ్డాయి. ఈ ప్రాభావం వలన మన మార్కెట్లు సైతం లాభాల బాట ని పట్టాయి. ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ , ఈ మార్చ్ నాటికి మూడు ప్రభుత్వ రంగ సంస్థ ల నుండి ప్రభుత్వ పెట్టుపడి ని ఉప సంహరించనున్నట్లు చేసిన ప్రకటన కూడా మార్కెట్లకు మరింత గా చేయూత నివ్వటం తో నేడు సెన్సెక్స్ 272పాయింట్లు బలపడి 17198పాయింట్ల వద్ద ముగిసింది. నేడు నిఫ్టీ కూడా 89 పాయింట్ల లాభం నమోదు చేస్తూ 5122 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు లాభాల లో నడవటం విశేషం నవంబెర్ మాసానికి ఆటో విక్రయాలు పుంజుకోవటం తో నేటి ట్రేడింగ్ లో ఆటో ఇండెక్స్ అత్యధికం గా 2.90 % ఎగబాకింది. కాగా బ్యాంకింగ్ రంగం 2.30 % లాభపడింది .
నేడు మిడ్క్యాప్ రంగం 1.77 శాతం, స్మాల్ క్యాప్ రంగం 2.15 శాతం వృద్ధిని నమోదు చేసాయి.
సెన్సెక్స్ స్టాకులను పరిశీలిస్తే, టాటా మోటర్స్ నేడు 6.03 శాతం ఎగబాకింది. కాగా DLF 5.46 % వృద్ధి చెందింది.