• 1-12-2009
  • మార్కెట్ నాడి
బలమైన జి. డి. పి గణాంకాల నేపధ్యం లో లాభపడ్డ మన మార్కెట్లు, నేడు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నం చేయనున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయినప్పటికి, చివరికి లాభాల లో పయనించటం విశేషం. ఐతే నేటి ఆసియా మార్కెట్లు మాత్రం తీవ్ర ఆటుపోట్లకి గురి అవుతూ, ప్రాఫిట్ బుకింగ్ కి లోనవుతున్నాయి.
మన దేశం లో నెలకొని ఉన్న అంశాలను పరిశీలిస్తే, ప్రధాన మంత్రి , మన దేశ జి. డి .పి 7 % వృద్ధి కన పరుస్తుందని భరోసా ఇవ్వటం వలన మార్కెట్ సెంటిమెంట్ కొంత బల పడినప్పటికీ, ఆర్ధిక సంస్కరణలు అమలు పరిచేందుకు మరింత సమయం పడుతుందని ప్రకటించటం కించిత్ నిరుత్సాహం కలిగించే అంశం. పైగా నిన్న విడుదల ఐన జి. డి. పి గణాంకాలు అంచానలకి మించి ఉండటం వలన రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని పెంచే దిశగా అడుగులు వేయటం తప్పనిసరి కానున్నది. ఈ అంశం పై రిజర్వు బ్యాంక్ అతి త్వరలో ప్రకటన చేసే అవకాశం లేక పోలేదు. నేడు మన మార్కెట్లు ,ఈ అంశాన్ని పరిగణ లో తీసుకొని , ఇతర ఆసియా మార్కెట్ల తో శృతి కలుపుతూ కొంత ఆటు పొట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16926
  • అవరోధాలు: 16978-17002-17124-17240
  • మద్దత్తులు:16844-16686-16454 -16264