• 3-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

నేటి ఉదయం మేము సూచించిన విధంగా స్వల్ప లాభాల తో మార్కెట్లు ముగిసాయి . సెన్సెక్స్ 15.77 పాయింట్లు లాభ పడి 17185 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్లు స్వల్ప వృద్ధిని సాధించి 5131 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ఉదయం స్థిరంగా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాన్నం తాజా ట్రేడ్ లో లాభాల బాట లో నడిచాయి. ఈ ప్రక్రియ లో సెన్సెక్స్ గరిష్టం గా 17361 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే మేము సూచించిన 17373 పాయింట్ల అవరోధం చెదించ లేక పోవటం తో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. దీనితో చివరి గంట ట్రేడింగ్ లో మార్కెట్లు పతనమయ్యాయి. పెరిగిన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు దోహద పడింది. ఈ వారం దేశంలో ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం 17.47 శాతానికి చేరుకుంది. గత నెల మూడవ వారాంతానికి ముందు 15.58 శాతంవున్న ఈ ద్రవ్యోల్బణం ఏకంగా 1.89 శాతం పెరిగి 17.47 శాతానికి చేరుకుందని . దీనితో ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 17128 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే, మా అంచనాలని నిజం చేస్తూ 17124 పాయింట్ల మద్దత్తు నిలబడటం తో సెన్సెక్స్ కోలుకొని చివరకు స్వల్ప లాభాన్ని నమోదు చేస్తూ ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.39 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ రంగం 0.92 శాతం లాభపడింది. నేటి ట్రేడింగ్ లో సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, ఆటో మరియు క్యాపిటల్ గూడ్స్ రంగం మినహా అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. ఈ రంగాలు 0.31 %, 0.06 % చొప్పున నష్టపోగా, హెల్త్ కేర్ ఇండెక్స్, మెటల్స్ ఇండెక్స్ 1.7 % , 1.2 % చొప్పున అత్యధికం గా లాభపడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో టాటా మోటర్స్ 3.3 % , HUL 1.9 % చొప్పున నష్టపోయాయి. కాగా RCOM 2.5 % లాభపడగా , హిందాల్కో 2.4 % వృద్ధిని సాధించింది.