- 29-12-2009
- మార్కెట్ నాడి
అమెరికా లో క్రిస్టమస్ సెలవల లో చిల్లర అమ్మకాలు జోరు అందుకోవటం తో ,అక్కడి రిటైల్ స్టాకు లు భారి లాభాలను ఆర్జించాయి. దీనితో అమెరికా మార్కెట్లు లాభాల తో ముగిసాయి. పైగా బర్క్లీ క్యాపిటల్ కి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త మాకి , 2010 అమెరికా స్టాక్ మార్కెట్లకు శుభకరం గా వుండగలదని జోస్యం చెప్పటం కూడా మార్కెట్ల సెంటిమెంట్ బలపడేందుకు సహాయపడింది. చైనా లో అంచనాలను మించి 2009 లో వృద్ధి నమోదు కావటం తో కూడా ప్రపంచ మార్కెట్లు నిన్న లాభాలను ఆర్జించాయి. నేడు జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి. బలబడుతున్న కమోడిటిలు, ముఖ్యం గా బంగారం, రాగి, ఉక్కు ,చమురు ధరలు పుంజుకోవటం వలన ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం నుండి బయటపడుతున్న అంచనాల తో ముడి చమరు ధర $ 78 కు ఎగబాకింది. మన మార్కెట్ల పరం గా యోచిస్తే , ప్రస్తుతం జపాన్ ప్రధాని హతోయమా మన దేశం లో పర్యటన భాగం గా పలు ఆర్ధిక ఒప్పందాలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ముకేష్ అంబానీ మరియు ఇతర బిజినెస్ దిగ్గజాల తో భేటి జరిపారు. ఈ అంశం పై వెలువడే ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. ౩ G సేవలకు సంబంధించిన వేలం పాట మరింత జాప్యం కానున్నందున నేడు టెలికం స్టాకులు కొంత మందకొడి గా పయనించే ఆస్కారం ఉంది. NMDC లో ప్రభుత్వం తమ వాటా ను 23 % మేరకు విక్రయించనున్నట్లు ప్రకటించటం వలన నేడు ఈ స్టాకు తో సహా ఇతర PSU స్టాకులు కూడా బలబడే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17361
- అవరోధాలు: 17373-17493-17578-17620
- మద్దత్తులు:17240-17124-17002-16978