• మార్కెట్ ముందు చూపు
  • ( 28-12-2009 నుండి 31-12-2009 వరకు )

సోమవారం మొహరం, శుక్రవారం ఆంగ్ల సంవత్సరాది కారణం గా ఈ వారం మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమె ట్రేడ్ కానున్నాయి. ఇప్పటికే క్రిస్మస్ సెలవల కారణం గా విదేశీ మదుపర్లు దూరంగా ఉండటం తో ట్రేడింగ్ వోలుమ్స్ క్షీణించాయి. కాబట్టి ఈ మినీ వారం లో మనీ , స్టాక్ మార్కెట్ల లో పెద్దగా కనపడకపోవచ్చు.

గత వారం మన మార్కెట్లు సుమారు 3.8 % మేరకు లాభాలను ఆర్జించాయి. ఐతే ఈ లాభాల లో పెద్దగా ట్రేడింగ్ వోల్యుమ్స్ లేకపోవటం గమనార్హం. గత వారం విడుదల అయిన కీలక గణాంకాలు మార్కెట్లను వృద్ధి బాటలో నడిపించాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ దేశ GDP శాతం ఉండగలదని ప్రకటించటం వంటి అంశాలే కాక, GOLDMAN SACH, BNP PARIBAS మున్నగు అంతర్జాతీయ సంస్థలు భారత దేశం తో సహా BRIC దేశాలపై పెట్టుబడులు విశేషం గా పెట్టవచ్చని, BRIC ( BRAZIL, RUSSIA, INDIA, CHINA ) దేశాల లో పెట్టుపడులు సురక్షితమని, ఈ దేశాలు అతి త్వరలో భారి అభివృద్ధి సాధించనున్నాయని జోస్యం చెప్పటం తో రానున్న సంవత్సరం లో మన దేశం లో విదేశీ మదుపరులు భారి గా మదుపు చేసే అవకాశం ఉంది. ఈ అంశం ప్రస్తుత మార్కెట్ పరిస్థితి కి అన్వయించి పరిశీలిస్తే ఒక విషయం మనకు బోధ పడనున్నది . ప్రస్తుతం సెన్సెక్స్ అతి కీలక అవరోధమైన 17493 పాయింట్ల కి అత్యంత చేరువలో ఉన్న విషయం తెలిసినదే. సెన్సెక్స్ నకు 17490 -17620 మధ్యగల కీలక అవరోధాలను , మార్కెట్లు , ఈ మూడు రోజుల లో ( అంటే విదేశీ మదుపర్లు సెలవల లో ఉన్నప్పుడు ) చెదించ గలిగితే , అప్పుడు మార్కెట్ల లో BUYING PANIC చోటుచేసుకునే అవకాశం ఉంది. అంటే, కీలక అవరోధాలను చేదిస్తే, విదేశీ పెట్టుపడులు మరింత గా మన మార్కెట్ల లో తరలి వచ్చే అవకాశం ఉన్నందున . మార్కెట్లు ఒక్క సారిగా విపరీతం గా పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ వారం ట్రేడింగ్ వోల్యుమ్స్ లేకపోయినప్పటికీ , అత్యంత కీలకమైన వారమని చెప్పవచ్చు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణం గా రిజర్వు బ్యాంక్ కేలక వడ్డీ రేటుని పెంచితే ఇప్పుడిప్పుడే వృద్ధిని సాధిస్తున్న మౌలిక రంగం పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి CRR ని మాత్రమె పెంచవచ్చు. కాబట్టి మార్కెట్లు , ఈ అంశం పై ప్రతికూలం గా భారి మోతాదులో ప్రభావితం కాకపోవచ్చు.. విదేశీ మార్కెట్ల గమనం, డిసెంబర్ 31 న ముగియనున్న F & O ముగింపు మార్కెట్లను ప్రభావితం చేయనున్నది.డిసెంబర్ f & o ముగింపు మార్కెట్లను ఈ గురువారం ఆటుపోట్లకి గురి చేసే అవకాశం ఉంది. టెక్నికల్ గా ఈ వారం 17350- 17490 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 5181 పాయింట్ల వద్ద నిఫ్టీ బలమైన అవరోధాన్ని ఎదురుకోనున్నాయి.అవరోధాలను అనూహ్యం గా చేదిస్తే మాత్రం మార్కెట్లు మరింత గా పరుగు తీసే అవకాశం ఉంది. నిఫ్టీ కి 4950, సెన్సెక్స్ నకు 16810 వద్ద విశేషమైన మద్దత్తు ఉంది. . 16696,16498 ,16196పాయింట్ల స్థాయి ఇతర కీలక మద్దతులు. . ఈ వారం 17493-17620-17824 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు