- 24 -12-2009
- మార్కెట్ రిపోర్ట్
నవంబర్ మాసం లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 60 % పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ ప్రకటించటం తో , అప్పటి వరకు ఫ్లాట్ గా పయనించిన మార్కెట్లు ఒక్కసారిగా గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. దీనితో నిఫ్టీ 34 పాయింట్లు లాభ పడి 5178 పాయింట్ల వద్ద ముగియగా, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 129.50 పాయింట్లు లాభపడి 17361 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము ఉదయం సూచించిన కీలక అవరోధమైన 17373 పాయింట్ల కి సమీపం గా గుర్తించాలి. నిఫ్టీ 0.66శాతం, సెన్సెక్స్ 0.75 శాతం మేరకు లాభపడ్డాయి.
నేటి ట్రేడింగ్ లో ఉదయం బలమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో లాభాల తో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా స్వల్ప ఒడి దుడుకులకు లోనయి ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 17198 పాయింట్లకు పడిపోయింది. ఇది మేము ఉదయం సూచించిన మాదత్తు స్థాయి కి నూటి కి నూరు పాళ్ళు సరిపోవటం విశేషం. డిసెంబర్ 12 నకు ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల అయ్యాయి. ఇది ఏకంగా 18.65 % కి ఎగబాకటం ట్రేడింగ్ బలహీనత కి కారణం అయ్యింది. ఐతే కేంద్ర వాణిజ్య మంత్రి చేసిన ప్రకటన తో మార్కెట్ల సెంటిమెంట్ మరల బలపడి , చివరకి లాభాల తో ముగిసాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.72 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.6 శాతం లాభపడ్డాయి. నేడు అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు లాభపడటం విశేషం. నేడు ఆటో ఇండెక్స్ 1.5 % గేరు మార్చగా, మెటల్స్ రంగం 1.42 % అధికం గా మెరిసింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే టాటా మోటర్స్ 4.42 %, MNM 3 % లాభపడ్డాయి. కాగా జై ప్రకాష్ అసో సియెట్ 2.75 %, భారతి అయిర్ టెల్ 1.59 % మేరకు నష్టపోయాయి.