- 24-12-2009
- మార్కెట్ నాడి.
పెరిగిన వినియోగ దారుల కొనుగోళ్ళు, లేబర్ మార్కెట్ కోలుకుంటోన్నదని గణాంకాలు వెలువడటం తో అమెరికా లో గత రాత్రి మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాలను కొనసాగిస్తున్నాయి. ముఖ్యం గా కమాడిటి ల లో చోటు చేసుకున్న ర్యాలి వలన ఆసియా మార్కెట్లు లాభాలను అర్జిస్తున్నాయి.
మన మార్కెట్ల పరంగా యోచన చేస్తే, . ఉద్దేపనలు వచ్చే బడ్జెట్ వరకు ఉపసంహరించేది లేదని ఆర్ధిక మంత్రి తేల్చి చెప్పటం, జి డి పి వృద్ధి 7.75% వుండ గలదన్న అంచనాలను ప్రకటించటం మున్నగు అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ని బలపరచాయి. ఈ అంశం మార్కెట్లకు లాభదాయకం. రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు పై జనవరి లో తుది నిర్ణయం ప్రకటించ నున్నదని, ప్రధానం గా CRR పెంచే అవకాశం ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుడు , రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ ప్రకటించటం బ్యాంకింగ్ వాటాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
రేపటి నుండి నాలుగు రోజుల పాటు వరుస సెలవల కారణం గా, సుదీర్ఘా వారాంతం వలన మధ్యాన్నం తదుపరి ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం ఉంది. పైగా 17493 పాయింట్ల కి సెన్సెక్స్ కి అతి భీకరమైన అవరోధం ఉన్నది కనుక , నేటి మార్కేట్లు సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో .. ముందుగా ఈ అవరోధం వరకు పెరిగి, మరల ప్రాఫిట్ బుకింగ్ కి గురి అయ్యే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17231
- అవరోధాలు: 17240-17373-17490
- మద్దత్తులు:17198-17124-17002-16978