- 23-12-2009
- మార్కెట్ రిపోర్ట్
జీడీపీ వృద్ధి రేటు ఇదే ఆర్థిక సంవత్సరంలో 8శాతానికి పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన సెన్సెక్స్ భారీ వృద్ధికి ఎంతో తోడ్పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో , మా అంచనాలకు అనుగుణం గా నేటి ట్రేడింగ్ ప్రారంభం నుంచి పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 17వేల మార్కును తాకింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 539 పాయింట్లు భారీగా లాభపడి, 17,231 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 159 పాయింట్లు వృద్ధి చెంది, 5,145 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్థిక వృద్ధి 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించటం తో మధ్యాహ్నం వరకు ఆసియా, యూరప్ మార్కెట్ల ఆశాజనక సంకేతాలతో కొనసాగిన బాంబే స్టాక్ మార్కెట్.. ఒక్కసారిగా సెన్సెక్స్ లాభాలతో పై.. పైకి.. ఉరకలేసింది. ఆర్ధిక మంత్రి ప్రకటన తరువాత, ఫ్యుచేర్స్ / ఆప్షన్స్ లో షార్ట్ కవేరింగ్ చోటు చేసుకోవటం వలన కూడా మార్కెట్లు ఎగ బాకేందుకు దోహద పడింది.నిఫ్టీ 5100 /5000 ఓపెన్ ఇంట్రెస్ట్ లో గణనీయం గా తగ్గుదల నమోదు కావటం నేటి ట్రేడింగ్ విశేషం.
ఇంకా మదుపుదారులు విదేశీ వాటాల కొనుగోళ్లపై దృష్టి మళ్లించడం, ఆయిల్, గ్యాస్, పవర్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ వంటి వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో సెన్సెక్స్ వృద్ధి బాటలో నడిచింది.
నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాల లో నడవటం విశేషం. ఉదయం మా అంచనాలకు అనుగుణం గా నేడు మెటల్స్ ఇండెక్స్, ఆయిల్ మరియు చమురు ఇండెక్స్ అత్యధిక లాభాలను ఆర్జించి మదుపర్ల కి లాభాల పంట పండించింది. ఈ రంగాలు 4.05 %, 3.43 % చొప్పున లాభపడ్డాయి.
నేడు మిడ్ క్యాప్ రంగం 1.57 %, స్మాల్ క్యాప్ రంగం 1.51 % మేరకు లాభపడ్డాయి.
నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకులు అన్ని కూడా లాభాల లో పయనించాయి. నేడు NTPC 7%, హిందాల్కో 7.8 % ఎగబాకాయి .