- 23-12-2009
- మార్కెట్ నాడి
ఫిబ్రవరి 2007 తరువాత గరిష్ట స్థాయి లో ,అంచనాలని మించి గృహ అమ్మకాలు జరిగాయని గణాంకాలు విడుదల కావటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి గా లాభపడ్డాయి. దీనితో అమెరికా లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నదని బలమైన సంకేతాలు వెలవడటం తో నేడు ఆసియా మార్కెట్లు సైతం బలం గా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల లో నిన్న మెటల్స్ రంగం లో చోటు చేసుకున్న హవా, నేడు కూడా కొనసాగుతోంది.
మన దేశం లో పరోక్ష పన్ను వసూలు లో సుమారు 21 % క్షీణత నమోదు కావటం వలన బడ్జెట్ లోటు తీవ్రమైయ్యే అవకాశం ఉంది. ఈ అంశం మన మార్కెట్లను ఆందోళన కి గురిచేసే అవకాశం ఉంది. Insider ట్రేడింగ్ కు పాల్పడిన రిలయన్స్ పై చర్య చేపెట్టేందుకు సెబి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఐతే ప్రభుత్వం ఈ అంశం పై స్పందించేందుకు పది రోజుల సమయం పడుతుందని చెప్పటం తో మార్కెట్లకు ప్రస్తుతానికి కొంత ఊపిరి పీల్చుకునే సమయం చిక్కిందని చెప్పవచ్చు. పైగా రిలయన్స్ కే. జి. బేసిన్ లో భారి గ్యాస్ నిక్షేపం కనుగోన్నందున ఈ వాటాల లో కొంత కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు కంపనీలకి సబ్సిడీ మొత్తాన్ని డబ్బు రూపేన ఇవ్వనున్నట్లు చేసిన ప్రకటన, ఆయిల్ బాండ్ల జారి చేయనున్నట్లు తెలియచేయటం మున్నగు అంశాలు నేడు ఆయిల్ కంపనీల వాటాల లో కొంత జోరు కనపడవచ్చు.
బలమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో , నేడు కూడా మన మార్కెట్లు శుభారంభం చేయనున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16692
- అవరోధాలు: 16719-16777-16810-16978
- మద్దత్తులు:16686-16589-16454 -16326