• 21-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

గత శుక్రవారం కనపరిచిన బలహీనత నేడు కూడా మార్కెట్ల లో చోటు చేసుకోవటం తో నేడు మార్కెట్లు నష్టపోయాయి. ఉదయం ప్రథమార్థం ఒడిదుడుకులకు లోనయిన మార్కెట్లు , మధ్యాన్నం తదుపరి భల్లుకాల గుప్పెట్లో ఇరుక్కుపోయాయి. సంస్థాగత మదుపర్ల నుండి ఎటువంటి కొనుగోళ్ళు లేకపోవటం తో మార్కెట్లు డీలా పడ్డాయి. దీనితో సెన్సెక్స్ 118 పాయింట్లు కోల్పోయి 16601 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 4952 పాయింట్ల వద్ద ముగిసింది.

నేడు మిడ్ క్యాప్ రంగం 0.46 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగ 0.15 శాతం క్షీణించింది.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో క్యాపిటల్ గూడ్స్ , మెటల్స్ రంగం 1.6 % చొప్పున నష్టపోగా, కన్సుమేర్ డ్యురబుల్స్ 1.3 %, ఆయిల్ మరియు చమురు రంగం 0.2% స్వల్ప లాభాలను నమోదు చేసాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు హిందాల్కో అత్యదికం గా 4 % నష్టపోయింది. కాగా MNM 3.2 % బలహీనపడింది. నేడు TCS 0.7 % , రిలయన్స్ ౦.6 % మేరకు లాభపడ్డాయి.