- 21-12-2009
- మార్కెట్ నాడి
శుక్రవారం అమెరికా మార్కెట్లు స్వల్పలాభాల తో ముగిసాయి. అమెరికా లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం పై నియంత్రణ సాధిస్తున్నట్లు ఫలితాలు విడుదల కావటం తో అక్కడి మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల లో పయనించే ప్రయత్నం చేస్తున్నాయి. జపాన్ లో trade surplus సుమారు 370 మిల్లియన్ల యెన్ లు గా నమోదు కావటం తో జపాన్ మార్కెట్లు లాభాల లో పయనిస్తున్నాయి. కాగా చైనా మార్కెట్లు టెక్నికల్ గా బలహీనం గా ఉండటం తో అటుపోట్లకి లోనవుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్ల లో కామో డిటి లు ముందంజ వేస్తున్నాయి.
మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే, మన టెక్స్ టైల్ రంగం ఎగుమతుల లో వృద్ధి సాధించటం వలన మార్కెట్లు కొంత ఊరట పొందే అవకాశం ఉంది. రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలన్, ద్రవ్యోల్బణం పై రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయటం భల్లు కాలకి ( BEARS) కి కొంత ఉత్సాహం కలిగించే అంశం.
నేడు మన మార్కెట్లు ఆసియా మార్కెట్లను అనుసరించి అప్రమత్త ధోరణి లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నేడు దుబాయి వరల్డ్ గురించి అప్పు ఇచ్చిన బ్యాంకులు తమ నిర్ణయం ప్రకటించనున్నాయి. ఈ అంశం ఐరోపా మార్కెట్లను, తద్వారా మన మార్కెట్లను మధ్యాన్నం తరువాత ప్రభావితం చేయనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16719
- అవరోధాలు: 16844-16978-17002
- మద్దత్తులు:16686-16454 -16326