• 22-12-2009
  • మార్కెట్ నాడి

అమెరికా మార్కెట్లు గత రాత్రి బలంగా ముగియటం తో , నేడు చైనా మినహా ఇతర ఆసియా మార్కెట్లు రెట్టింపు ఉత్సాహం తో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బల పడుతున్న సంకేతాలు వెలవడటం, కోపెన్ హగెన్ సదస్సు లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ..భారత్ , చైనా దేశాలను బుజ్జగించటం లో సఫలం కావటం మున్నగు అంశాల తో అమెరికా మార్కెట్లు బల పడ్డాయి. .

అంతర్జాతీయ విపణి లో పెరుగుతున్న మెటల్స్ ధరల కారణం గా ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాట లో నడుస్తున్నాయి. కాగా దుబాయ్ వరల్డ్ సంస్థ బ్యాంకు ల తో చర్చలు ప్రారంభించటం కూడా కొంత నిలక సాధించేందుకు ఉపకరించిందని చెప్పవచ్చు. ఐతే దుబాయ్ వరల్డ్ మాత్రం ఈ చర్చల అంశాలు బయటకు పొక్క నీయ కుండా కసరత్తు చేయటం కించిత్ ఆశ్చర్యం కలిగించే అంశం.

మన మార్కెట్ల పరం గా కీలక అంశాలు చర్చిస్తే, సెన్సెక్స్ సుమో వీరుడైన రిలయన్స్ పై insider trading అభియోగం నిర్ధారణ అవ్వటం తో SEBI చేపట్టే తదుపరి ప్రక్రియ మన మార్కెట్ల పరం గా కీలకం. ఐతే SEBI ఈ అంశం పై మరికొంత కాలం జాప్యం చేసే అవకాశం లేకపోలేదు. ( వివరాలకు ఈక్విటీ పేజి చూడగలరు )

3 G స్పెక్ట్రం వేలం జనవరి లో , ముందు సూచించిన విధం గా నే , జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలు సమస్యాయుతం గా మారనున్నట్లు ప్రభుత్వం తెలియచేయటం కూడా మార్కెట్ల ను ఆందోళన పరిచే అంశం. ప్రపంచ మార్కెట్ల లో కూడా చెక్కర ధరలు ఆకాశానికి అంటటం తో దిగుమతులు తమకు గిట్టుబాటు కావట్లేదని బజాజ్ హిందూస్తాన్ కంపని ప్రకటన వలన పరిస్థితి ఎంత తీవ్ర రూపం లో ఉందో అంచనా వేయవచ్చు.

గత మూడు రోజులు గా మన మార్కెట్లు క్షీణించాయి గనుక , నేటి బలమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లో పుల్ బ్యాక్ ర్యాలి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఐతే రిలయన్స్ పై SEBI ప్రకటన చేస్తే మాత్రం మార్కెట్లు కుదేలు మనటం ఖాయం . కాబట్టి మదుపర్లు అప్రమత్త త తో ట్రేడ్ చేయటం మంచిది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16601
  • అవరోధాలు: 16686-16777-16844
  • మద్దత్తులు:-16589-16454 -16314