- మార్కెట్ ముందుచూపు
- ( 21 డిసెంబర్ నుండి 24 డిసెంబర్ వరకు )
2009 నకు చివరిసారిగా డేరివేటిస్ , ఈ గురువారం ముగియనున్నది. ఈ అంశం వలన , ఈ వారం మార్కెట్లు ఆటుపోట్ల కి గురికానున్నది.
గడిచిన వారం బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు కూడా క్షీణించాయి.మన మార్కెట్లు సుమారు 2.5 % క్షీణించాయి. సంస్థాగత మదుపర్ల నుండి కొనుగోళ్ళు లేకపోవటం తో మార్కెట్ల లో ట్రేడింగ్ వోల్యుమ్స్ క్షీణించాయి. విదేశీ ఫండ్ల నుండి కూడా రాగల క్రిస్మస్ , నూతన సంవత్సర సెలవల కారణం గా పెద్దగా కొనుగోళ్ళు లేకపోవటం తో మార్కెట్లు మందకొడిగా పయనించాయి.ఈ వారం కూడా ఇదే ధోరణి మార్కెట్ల లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఐతే విదేశీ సంస్థలు సుమారు 2364 కోట్ల రూపాయల మేరకు నిఫ్టీ ఫ్యు చేర్స్ గతవారం లో లో అమ్మకాలు జరపటం చెప్పుగోదగ్గ అంశం.
స్థానిక అంశాలను పరిశీలిస్తే, నవంబర్ మాసానికి 4.78% పెరిగిన WPI ద్రవ్యోల్బణం, డిసెంబర్ మొదటి వారానికి గాను ఆహార సరుకుల ద్రవ్యోల్బణం ..(స్టాకు ల UPPER CIRCUIT తలపించే విధం గా , సరిగ్గా) 19 .95 % ఎగబాకటం వంటి అంశాలు , సాధారణ పరిస్థితి లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని పెంచేందుకు ప్రోత్సహించే విధం గా వుండేది. ఐతే, గత వారం అమెరికా లో చోటు చేసుకున్నే అమెరికా ఫెడ్ సమావేశాల లో అక్కడి వడ్డీ రేటు ని పెంచాబోరని స్పష్టం చేయటం వలన రిజర్వు బ్యాంకు కి కొత్త సమస్య సృష్టించింది. మన దేశ రిజర్వు బ్యాంక్ , కీలక వడ్డీ రేటు ని పెంచితే , విదేశాలనుండి డబ్బు ని మన దేశం లోకి ఆహ్వానించి నట్లవు తుంది .పైగా అమెరికా డాలర్ గత కొన్ని రోజులు గా బలపడుతున్నందున ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకోనున్నది. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం తో సతమత మౌతున్న రిజర్వు బ్యాంక్ కొత్త గా ఈ శిరోభారం కోనితెచ్చుకోకపోవచ్చని మా అంచనా. బహుశా కీలక వడ్డీ రేటు జోలికి వెళ్ళకుండా . కేవలం CRR ని పెంచి బ్యాంకులు ఇచ్చే రుణాల పై కొంత నియంత్రణ సాధించే విధం గా రిజర్వు బ్యాంక్ ప్రకటన చేసే అవ్వకాశం ఉంది. మా వాదన కి బలం చేకూరుస్తూ మార్కెట్ల లో బ్యాంక్ స్టాకు ల లో క్షీణత ఇప్పటి కే ప్రారంభామయ్యిమ్దని గమనించాలి.
కాబట్టి రిజర్వు బ్యాంక్ మరికొంత సంయమనం పాటించే అవకాశం ఉన్నందున , మార్కెట్లు ఇప్పుడే కుప్పకూలిపోయే పరిస్థితి ఎదురు కాక పోవచ్చు. అంటే, ట్రేడింగ్ వోల్యుమ్స్ కరువై ఒక పక్క, అమ్మకాలను పెంచే వత్తిడి కి కారణాలు కూడా లేక మరొక పక్క వుండటం వలన , ఈ వారం మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఐతే రిజర్వు బ్యాంక్ విధానం మాత్రం రానున్న రోజుల లో కీలక పాత్ర పోషించ నున్నది.
జనవరి నుండి అంతర్జాతీయ పోకడలకి అనుగుణం గా మన మార్కెట్ల లో కూడా స్టీల్ ధరలు పెరగనున్నాయి. ఈ అంశం వలన, SAIL , BHUSHAN STEEL, JSW, ESSAR,TATA STEEL మున్నగు స్టాకు ల లో కొంత సంచలం ఈ వరం మనకి కనిపించ వచ్చు. పైగా కోపెన్ హగెన్ లో చోటు చేసుకున్న అమ్తజాతీయ పర్యావరణ సదస్సు విఫలం కావటం వలన కాలుష్యానికి కారణమయ్యే ఉక్కు కర్మాగారాల పై , ఇప్పట్లో ఎటువంటి వత్తిడి కలగక పోవటంకూడా ఈ స్టాకు లు బలపడెందుకు సహాయపడవచ్చు.
పెరుగుతున్న అమెరికా డాలర్ విలువ సాఫ్ట్ వేర్ కంపనీలకి లాభదాయకం. అంతర్జాతీయ విపణి లో పెరుగుతున్న ముడిచమురు ధరల వలన ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల పై భారం అధికం కానున్నది.
ఇక ముందస్తు పన్ను అంచనాల ఆధారం గా బ్యాంకింగ్ రంగం రియాలిటీ రంగం మినహా , ఇతర రంగాలు అధిక మొత్తం లో చెల్లించటం -- ముఖ్యం గా ఆటో మొబైల్ , ఫార్మ రంగాల కంపనీలు పన్నులు అధిక మొత్తం లో చెల్లించటం ద్వారా జనవరి లో ఈ రంగాల కి చెందిన స్టాకుల ఫలితాలు ఉత్తమంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.
టెక్నికల్ గా పరిశీలిస్తే , చార్టు ల లో గత వారం ఏర్పడ్డ TRIPLE TOP ఈ వారం మరింత గా ప్రస్పుటం కానున్నది. ఈ అంశం మార్కెట్ లో ఏర్పడ బోయే BEARISH TREND కి సంకేతం గా భావించవచ్చు. సెన్సెక్స్ 17493 పాయింట్లు, నిఫ్టీ 5100 మార్కు దాటనిదే మార్కెట్ల లో బుల్ల్స్ హవా కోన సాగు తుందని చెప్పలేము. ఐతే నిఫ్టీ నకు 4950 వద్ద విశేషమైన మద్దత్తు ఉంది. ఇది క్షీణిస్తే సుమారు 4840 పాయింట్ల వరకు పడిపోయే ప్రమాదం ఉంది. కాగా సెన్సెక్స్ నకు 16696,16498 ,16196పాయింట్ల స్థాయి కీలక మద్దతులు. . ఈ వారం 16810-17002-17124-17240-17493 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు .
ఈ వారం ముగియనున్న డిసెంబర్ నెల తాలూకు F & O ముగింపు , శుక్రవారం క్రిస్టమస్ , సోమవారం మొహరం -- సుదీర్ఘ వారాంతం సెలవల కారణం గా ఈ వారంతానికి మార్కెట్లు స్వల్పం గా బలహీనపడే ఆస్కారం ఉంది.