• 17-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

షేర్‌మార్కెట్ భారీ హెచ్చు-తగ్గుల మధ్య ప్రారంభమై కాసింత తగ్గుదల నమోదు చేసి నష్టాలతో ముగిసింది. బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ గురువారం నాటి నివేదికను బుధవారంతో ముగిసిన నివేదికతో పోలిస్తే 18 పాయింట్లు తగ్గి 16,894 పాయింట్లకు చేరుకుంది. అదే నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ఎన్ఎస్ఈ)కి చెందిన నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 5,036 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో ఆద్యంతం ఆటుపోట్లకి మార్కెట్లు గురియ్యాయి. ఒక దశ లో భారిగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణం గా కనిష్టం గా 16826 పాయింట్ల వరకు పతనమైన మార్కెట్లు, కొద్ది సేపటికే అనూహ్యం గా లాభాల బాట పయనించి గరిష్టం గా 16979 పాయింట్ల వరకు చేరుకుంది. ఇది మేము ఉదయం సూచించిన కీలక అవరోధమైన 16978 పాయింట్ల కి సరిగ్గా సరిపోవటం విశేషం.ఐతే ఐరోపా మార్కెట్లు బలహీనం గా ప్రారంభమవ్వటం తో మార్కెట్లు మరొక సారి నష్టపోయింది. నేటి ట్రేడింగ్ సమయం లో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. డిసెంబరు మొదటి వారంలో ద్రవ్యోల్బణం 19.95 శాతానికి చేరుకుంది. నిత్యావసర సరుకులు ధరల ఆధారంగా నవంబర్ చివరి వారాంతానికి ద్రవ్యోల్బణం 19.05 శాతంగా ఉండింది. ఈ అంశం పైన నేడు పార్లమెంట్ లో కూడా రభస జరగటం చేపుకోదగ్గ అంశం. నేటి ట్రేడింగ్ లో మరొక విశేషం చోటుచేసుకుంది .నేడు సెన్సెక్స్, నిఫ్టీ అధికారులు సంయుక్తం గా చేసిన ప్రకటన మార్కెట్ వర్గాలకు ఊరట కలిగించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ అధికార వర్గాలు ఓ పక్షం రోజులు వాయిదా వేసినట్లు ప్రకటించాయి. శుక్రవారం నుంచి అమలులోకి రానున్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కొత్త సమయంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో సమయాన్ని ఓ పక్షం రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు ప్రకటించాయి. సవరించిన మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని వచ్చే ఏడాది జనవరి నాలుగు నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో అప్పటి వరకు పాత సమయాన్నే యధావిధిగా కొనసాగిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.09 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.88 శాతం లాభపడటం విశేషం.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో కాపిటల్ గూడ్స్ రంగం 1.72 %, హెల్త్ కేర్ రంగం 1.44 % వృద్ధిని నమోదు చేయగా, రియాలిటి 1.11 %, చమురు మరియు గ్యాస్ 0.59 % మేరకు క్షీణించాయి. సెన్సెక్స్ స్టాకు ల లో నేడు DLF , LNT 3.7%, 1.3 % చొప్పున నష్టపోగా, హిందూస్తాన్ యూని లెవేర్, హిందాల్కో 1.6 %, 1.4 % చొప్పున లాభపడ్డాయి .