• 18-12-2009
  • మార్కెట్ నాడి
అంచనాలని తలక్రిందలు చేస్తూ అమెరికా లో నిరుద్యోగ గణాంకాలు పెరిగిపోవటం తో , కథ మరో సారి మొదటికి వచ్చింది. ఈ దెబ్బ తో గత రాత్రి అమెరికా మార్కెట్లు కుదేలుమన్నాయి. అమెరికా మార్కెట్లు ఆర్ధిక మాంద్యం లోనే ఇంకా కొట్టు మిట్టాడుతోందని హార్వర్డ్ యూనివెర్సిటీ తెల్చిచేప్పటం కూడా మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీసింది.
ఈ నేపధ్యం లో మొన్న బాసెల్ అగ్రీమెంట్ పై వెలువడిన వార్తల పై అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ సంస్థ మరల వెనకడుగు వేయటం తో బ్యాంకింగ్ స్టాకులు నష్టపోయాయి.
నిన్న గ్రీసు దేశాన్ని మరొక సారి రేటింగ్ ఏజెన్సి లు , రేటింగ్ తగ్గించటం తో , యూరో విలువ పతనానికి, తద్వారా డాలర్ విలువ పెరిగేందుకు దోహద పడింది. ఈ కారణాల వలన నేడు ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాలకు లోనవుతున్నాయి.
మన మార్కెట్ల పరిస్థితి సమీక్షిస్తే , ఆహార ధాన్యాల దిగుమతులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం పై రిజర్వు బ్యాంక్ అతి త్వరలో (డిసెంబర్ అంతానికి ) కీలక రేటు పై విధానం ప్రకటించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుడు, మాజీ రిజర్వు బ్యాంక్ గవర్నర్ రంగ రాజన్ ప్రకటించారు . పైగా ప్రఖ్యాత మదుపరి మార్క్ ఫబెర్ , బ్లూం బెర్గ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో , భారత్ స్టాక్ మార్కెట్లు కనీసం 20 నుండి 30% దిద్దుబాటు కి లోనవ్వనున్నాయని ప్రస్తావించటం గమనార్హం. ఐతే దీర్ఘ కాలానికి భారత్ మార్కెట్లు భేష్ అని కితాబు ఇవ్వటం కొంత ఊరట కలిగించే అంశం. అదే విధం గా HDFC అధినేత కేకే మిస్త్రి , భారత దేశం లో దుబాయి వంటి రియల్ ఎస్టేట్ బుడగ చోటు చేసుకునే అవకాశం లేదని చెప్పటం కూడా మార్కెట్లను కొంత ఊరట కలిగించే అంశం.
ఈ నేపధ్యం లో మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్లను అనుసరించి నేడు కూడా బలహీనత ప్రదర్శించే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16894
  • అవరోధాలు: 16978-17002-17124-17240
  • మద్దత్తులు:16844-16810-16686-16454