• 17-12-2009
  • మార్కెట్ నాడి

బలమైన CPI, గృహ నిర్మాణ గణాంకాల వలన గత రాత్రి లాభపడ్డ అమెరికా మార్కెట్ల జోరు వలన , నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి. నేడు జాపాన్ మార్కెట్ల లో చోటు చేసుకుంటున్న కామోడిటి ర్యాలి వలన అక్కడి మార్కెట్లు సైతం లాభాల లో పయనిస్తున్నాయి.

మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే, స్టాక్ ఎక్స్ చేంజ్ ల లో చోటు చేసుకున్న మార్పుల వలన నేడు మార్కెట్లు కొంత మందకొడి గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నేడు BSE లో నెల మధ్య లో డేరివేటివ్స్ ముగింపు కావటం విశేషం. ఈ కారణం గా ఫ్యు చేర్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాకు లు కొంత ఆటు పొట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది. పైగా , రేపటి నుండి స్టాక్ ఎక్స్ చేంజ్ ట్రేడింగ్ సమయాల లో మార్పుల వలన బ్రోకేర్లు కొంత సర్దుబాటు చేసుకోవటం పై దృష్టి పెట్టె అవకాశం ఉన్నందున ట్రేడింగ్ వోల్యుమ్స్ పై నేడు , ఈ అంశం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపటి నుండి ట్రేడింగ్ ఉదయం 9 గంటలనుండి ప్రారంభం కానున్నది.

మన దేశ ఎగుమతులు , 13 నెలల తరువాత ఎట్టకేలకు వృద్ధిని నమోదు చేయటం వలన , సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో , నేడు మార్కెట్లు శుభారంభం చేసే అవకాశం ఉంది. నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మధ్యాన్నం తదుపరి మార్కెట్లను ప్రభావితం చేయనున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16912
  • అవరోధాలు: 16978-17002-17124-17240
  • మద్దత్తులు:16844-16810-16686-16454