• 16-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

యూరోపియన్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 35 పాయింట్లు పుంజుకుని, 16,912 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 9 పాయింట్ల స్వల్ప లాభంతో 5,042 పాయింట్ల వద్ద నిలిచింది. యూరోపియన్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే యూరోపా మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడం కూడా సెన్సెక్స్‌కు ఊతమిచ్చింది. దీనితో ఒక దశ లో సెన్సెక్స్ గరిష్టం గా 16996 పాయింట్ల వరకు ఎగబాకింది. ఇది మేము ఉదయం సూచించిన కీలక అవరోధమైన 17002 పాయింట్ల కి అత్యంత సమీపం గా ఉండటం విశేషం. ఈ కీలక అవరోధాన్ని చెదించ లేక , సెన్సెక్స్ చివరికి 16912 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం లాభాలను నమోదు చేసింది.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు ఐ. టి ఇండెక్స్ , టెక్ ఇండెక్స్ 1.6 % చొప్పున లాభపడ్డాయి. ముందస్తు పన్ను దాఖలాల ను అనుసరించి , నేడు ఇన్ఫోసిస్ వాటాలు భారిగా లాభపడ్డాయి. ఈ అంశం ఐ. టి. ఇండెక్స్ లాభాపడెందుకు దోహదం చేసింది. ఐతే నేటి ట్రేడింగ్ లో రియాలిటీ రంగం 1.2 % నష్టపోయింది.

సెన్సెక్స్ వాటాల లో టాటా మోటర్స్ 3.1%, MNM 2.9% వృద్ధిని నమోదు చేసాయి. కాగా JP ASSOCAITES 2.2 % , SBI 1.3 % నష్టపోయాయి. రిజర్వు బ్యాంకు వడ్డీ రేటుని పెంచే ఆస్కారం ఉందని బ్యాంకింగ్ స్టాకులు నేటి ట్రేడింగ్ లో పెద్దగా రాణించలేదు. ఐతే. బెసేల్ ప్రతిపాదన ను అనుసరించి, ఆసియా, ఐరోపా మార్కెట్ల లో బ్యాంకింగ్ స్టాకులు మాత్రం భారి లాభాలను గడించాయి.