• 16-12-2009
  • మార్కెట్ నాడి

అమెరికా ఫెడ్ రిజర్వు కీలక సమావేశాల నేపధ్యం లో , డాలర్ బలపడుతున్న కారణం గా , త్వరలో ఆర్ధిక వ్యవస్థ లో నింపిన $12 ట్రిల్లియన్లు ఉపసంహరించే యోచనలు ఉండవచ్చని కారణం తో అమెరికా మార్కెట్లు నిన్న నష్టపోయాయి.

ఐతే నేడు ఆసియా మార్కెట్లు బలం గా ప్రారంభమయ్యాయి.చైనా లో FDI పెట్టు బడులలో 32 % పెరుగుదల కారణం గా షాంగై మార్కెట్లు కూడా లాభాల లో పయనిస్తున్నాయి. ముఖ్యం గా బాసెల్ బ్యాంకింగ్ ప్రతిపాదనలను అమలు పరిచేందుకు మరికొంత సమయం , ఇంకొంత వెసులుబాటు కలగనున్నట్లు వార్త వెలువడటం తో జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. బాసెల్ అగ్రీ మెంట్ లో మన దేశం కూడా సంతకం చేసినందున , మన బ్యాంకింగ్ స్టాకులు, ముఖ్యం గా అంతర్జాతీయ వాణిజ్యం , లావా దేవీలు గల బ్యాంకుల స్టాకు లు లాభపడే అవకాశం ఉంది.

ఈ నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా నిన్నటి నష్టాలను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు

    • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
    • గత ముగింపు: 16877
    • అవరోధాలు: 16978-17002-17124-17240
    • మద్దత్తులు:16810-16686-16454 -16264