- 14-12-2009మార్కెట్ నాడి
దుబాయి వరల్డ్ జారిజేసిన ఇస్లామిక్ బాండ్ల గడువు నేటి తో తీరనున్నది.దుబాయి వరల్డ్ ఈ అప్పుని తీర్చలేని పరిస్థితి ఉండటం తో, ఈ పర్యవసానం గా జనవరి , మే 2011 లో చెల్లించవలసిన మరో రెండు అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. ఇది ఇలా ఉండగా, జపాన్ లో బిజినెస్ సెంటిమెంట్ సర్వే గణాంకాల లో తగ్గుదల నమోదు కావటం , క్రూడ్ ఆయిల్ ధర లో తగ్గుదల మున్నగు కారణాల వలన జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు బలహీనం గా ట్రేడ్ అవుతున్నాయి.
నేటి ట్రేడింగ్ లో మన మార్కెట్లు , ఆసియా మార్కెట్లకు అనుసంధానం గా కొంత బలహీనత కనపరచే అవకాశం ఉంది. పెరుగుతున్న ఆహారా ధరల నేపధ్యం లో నేటి ట్రేడింగ్ లో షుగర్ మరియు ఇతర ఆహార ధాన్యాల స్టాకులు కొంత పుంజుకునే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కామోడిటి ల లో కనవచ్చిన దిద్దుబాటు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17119
- అవరోధాలు: 17125-17198-17240-17373
- మద్దత్తులు:17002-16978-16810