- 14-12-2009
- మార్కెట్ రిపోర్ట్
అబూధాబి నుండి $10 బిల్లియన్ల ఆర్థిక సహాయం అందటం వలన దుబాయి $4.1 బిల్లియన్ల అప్పుని తీర్చుకునే మార్గం సుగమనం కావటం తో నేడు ఆసియా మార్కెట్లు కొంత బలపడ్డాయి. ఈ నేపధ్యం లో మన మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల గమనాన్ని అనుసరించి లాభాల బాట లో నడిచాయి. ఐతే నేడు విడుదల ఐన నవంబర్ మాసపు ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లను మరల బలహీనపరిచింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి -నవంబర్ నెలలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా 4.78 శాతం పెరిగింది.అక్టోబర్‌లో కేవలం 1.34 శాతం మాత్రమే ద్రవ్యోల్బణం పెరిగింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం నవంబర్ నెలలో ఉన్న ద్రవ్యోల్బణం 8.48 శాతంగా ఉండింది . దీనితో మధ్యాన్నం తదుపరి అమ్మకాల వత్తిడి పెరగటం తో మార్కెట్లు నష్టపోయి చివరికి స్వల్ప నష్టాలను నమోదు చేస్తూ ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్21 పాయింట్ల స్వల్ప నష్టాన్ని నమోదు చేస్తూ 17098 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 11.6పాయింట్లు కోల్పోయి , 5106 పాయింట్ల వద్ద నిలిచింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.67 శాతం, స్మాల్ క్యాప్ 0.45 శాతం మేరకు క్షీణించాయి. కాగా సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు ఐ. టి ఇండెక్స్ 1.96 % , క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్0.95 శాతం లాభపడ్డాయి. కాగా FMCG ఇండెక్స్ 1.43%, కన్సుమేర్ డ్యు ర బుల్ 1.18 % నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో ACC 5.33 % ఎగబాకింది. కాగా విప్రో 2.23 % వృద్ధి ని నమోదు చేసింది. ఐతే భారతి అయిర్ టెల్ మాత్రం 3.47 % నష్టాలను నమోదు చేసింది.