- మార్కెట్ ముందు చూపు
- (14-12-2009 నుండి 18-12-2009 వరకు )
గత వారం మార్కెట్లు అతి స్వల్ప లాభాలను నమోదు చేస్తూ ఫ్లాట్ గా ముగిసాయి. ప్రధానం గా స్టాకు లు వారిగా మార్కెట్లు ట్రేడ్ అయినాయి. గత ఆదివారం ఈ శీర్షిక లో మేము ప్రచురించిన విధం గా నే స్మాల్ క్యాప్ రంగం ముందంజ వేయటం విశేషం. RBI ప్రకటించిన విధానం వలన టెలికాం స్టాకు లు గూడా విశేషం గా లాభాలను ఆర్జించాయి. వారం చివరన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదల కావటం తో BHEL, LNT మున్నగు క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన స్టాకులు పుంజుకున్నాయి. ఐతే IIP - పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు 10.3 % వృద్ధి కనపరచినప్పటికీ మార్కెట్ల అంచనాలకి అనుగుణం గా లేకపోవటం తో మార్కెట్లు కొంత అమ్మకాల వత్తిడి కి గురి అయ్యాయి.
ఇక ఈ వారం పరిస్థిని ని అంచనా వేస్తె, గత వారాంతం లో మార్కెట్లు కనపరచిన బలహీనత , ప్రపంచ మార్కెట్ల కి అనుగుణం గా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యం గా స్పైన్, గ్రీసు దేశాలని ఏజెన్సి లు రేటింగ్ తగ్గించినందున ప్రపంచ మార్కెట్లు కొంత మందకొడిగా వ్యవహరించే అవకాశం ఉంది. పైగా , రానున్న క్రిస్మస్ ని దృష్టి లో నుంచుకొని, విదేశీ సంస్థాగత మదుపర్లు సెలవల పై , మార్కెట్ల కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశం ట్రేడింగ్ వాల్యూం పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం లో గత ఋతుపవనాల సమయం లో చోటు చేసుకున్న అతి వృష్టి, అనావృష్టి కారణం గా ఆహార ధాన్యాలు ధరలు తార స్థాయికి ఎగబాకాయి. ఈ కారణం గా నవంబర్ చివరి వారానికి ద్రవ్యోల్బణం 19.8 శాతం ఎగబాకటం వలన , రిజర్వు బ్యాంక్ పై కీలక వడ్డీ రేటు పెంచాల్సిన వత్తిడి మరింత తీవ్రం కానున్నది. ఉద్దీపన ప్యాకేజీలు , సానుకూల ఫలితాలు GDP, IIP గణాంకాల లో వృద్ధి రూపం లో అందించటం తో రిజర్వు బ్యాంక్ ఈ నెల చివరికి విధానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ తాలూకు ఒకటి రెండు సూచనలు అప్పుడప్పుడు వెలువడే అవకాశాలు ఈ వారం లో లేకపోలేదు. ఐతే ఈ ద్రవ్యోల్బణం ఆహార ధాన్యాల కొరత వల కాబట్టి, వడ్డీ రేటు ద్వారా ఇటువంటి ద్రవ్యోల్బణం నియంత్రించటం సాధ్యపడదు. కాబట్టి రానున్న నెలల లో కీలక వడ్డీ రేటు ని రిజర్వు బ్యాంక్ పెంచినా , ద్రవ్యోల్బణం ఇదే విధం గా కొనసాగే అవకాశం ఉన్నందున దీర్ఘ కాలిక మదుపర్లు వ్యవసాయ రంగానికి చెందిన స్టాకు లను ఎంపిక చేసుకోవటం గురించి ఆలోచన చేయవచ్చు. గత వారం ఘోరం గా నష్టపోయిన మెటల్స్ స్టాకు ల లో , ఈ వారం చివరలో కొంత కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వలన ఆంధ్రప్రదేశ్ కి చెందిన స్టాకు లు కోల్పోయే అవకాశం ఉంది. ఇందులో ఉత్తమ స్టాకు లను , ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చు. అదే విధం గా ఈ వారం నుండి కంపనీల ముందస్తు పన్ను చెల్లింపుల విషయాలు కూడా మనకి తెలియరావచ్చు. ఈ అంశం కూడా , స్టాకు ల వారిగా ట్రేడ్ చేసుకునేందుకు అవకాశం కలిగించ నున్నది. టెక్నికల్ గా పరిశీలిస్తే, చార్ట్లు 17300 పాయింట్ల సమీపం వద్ద triple TOP ఏర్పడిన కారణం గా , మార్కెట్లు -- ఈ వారం 17350- 17490 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 5181 పాయింట్ల వద్ద నిఫ్టీ బలమైన అవరోధాన్ని ఎదురుకోనున్నాయి. అనూహ్యమైన కారణాల వలన, మంచి వార్త వెలువడితే తప్ప , ఈ వారం మార్కెట్లు ఈ అవరోధాలని చేదించటం కష్టం. కాగా నిఫ్టీ కి 4950, సెన్సెక్స్ నకు 16810 వద్ద విశేషమైన మద్దత్తు ఉంది. . 16696,16498 ,16196పాయింట్ల స్థాయి ఇతర కీలక మద్దతులు. . ఈ వారం 17240-17493-17620-17824 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు