• 11-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు శుభారంభం చేసిన మార్కెట్లు , అక్టోబర్ మాసపు IIP ( పారిశ్రామిక ఉత్పత్తి ) గణాంకాలు అంచనాల కంటే తక్కువ గా విడుదల కావటం తో మార్కెట్లు నష్టపోయాయి. దీనితో సెన్సెక్స్70 పాయింట్లు కోల్పోయి 17119 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 17పాయింట్లు నష్ట పోయి 5117పాయింట్ల వద్ద ముగిసింది.

నేడు విడుదల ఐన అక్టోబర్ నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తులు వృద్ధి చెంది 10.3 శాతానికి చేరుకున్నాయి. నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన ఉత్పత్తుల వృద్ధి కేవలం 0.1 శాతం మాత్రమే ఉండింది. అక్టోబర్ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ 11.1 శాతం పెరిగింది. పారిశ్రామికోత్పత్తులు 9.1 శాతం పెరిగి 9.6 శాతానికి చేరుకుంది. కాని దేశీయ పారిశ్రామికోత్పత్తులు కనీసం 12.5 % గా ఉండవచ్చన్నమార్కెట్ అంచనాలు తలకిందులుగా అవ్వటం తో మార్కెట్లు నష్టపోయాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.60శాతం , స్మాల్ క్యాప్ 0.73 % శాతం చొప్పున క్షీణించాయి. సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేటి ఉదయం మా అంచనాలకు అనుగుణం గా క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 0.64 శాతం ఎగబాకింది. కాగా పవర్ ఇండెక్స్ కూడా 0.59 శాతం పవర్ కనపరిచింది. నేటి ట్రేడింగ్ లో బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 1.22 శాతం కోల్పోగా , రియాలిటి రంగం కూడా 0.94 శాతం క్షీణించి మార్కెట్ నష్ట పోయేందుకు కారణ మయ్యింది.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , BHEL నేడు అత్యధికం గా 3.12 % లాభపడింది. కాగా భారతి అయిర్ టెల్ 3.21 % నష్టపోయింది.