• 11-12-2009
  • మార్కెట్ నాడి

అమెరికా లో తగ్గిన వాణిజ్య లోటు, మెరుగవుతున్న ఉద్యోగ పరిస్థితుల వలన అక్కడి మార్కెట్లు నిన్న లాభాల లో పయనించాయి. నేటి ఆసియా మార్కెట్ల లో కూడా ఇదే జోరు తో ప్రారంభమయ్యాయి. ఐతే, నేటి ఉదయం జపాన్ లో IMF అధికారి లిప్స్కీ ప్రసంగం లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇంకా అంతంత మాత్రం గానే ఉందని సూచించటం వలన మార్కెట్లు తిరిగి అప్రమత్త ధోరణి అవలంభించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిశ్రమం గా పయనిస్తున్నాయి.

మన దేశాని కి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే, నిన్న విడుదల అయిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతం గా ఎగబాకుతున్నయన్న అంశానికి మరొక సారి ప్రాధాన్యత సంతరింప చేసింది. దీనితో రిజర్వు బ్యాంక్ నకు , అతి త్వర లో ద్రవ్యోల్బణాన్ని కట్టు దిట్టం చేసే చర్యలు చేపట్టే పరిస్థితి అనివార్యం కానున్నది . ఈ అంశం పై రిజర్వు బ్యాంక్ చేసే ప్రకటనలు కీలకం కానున్నది. అదే విధం గా , నేడు అక్టోబర్ నెలకి సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం కూడా, మన మార్కెట్ల దృష్టి ని ఆకర్షించ నున్నాయి. ఈ కారణం వలన , నేడు కూడా క్యాపిటల్ గూడ్స్ రంగం లో సంచలనం కనపడవచ్చు. స్టాకు ల వారిగా పరిశీలిస్తే, ప్రభుత్వం RCOM పై అపరాధ రుసుము విధించనున్నట్లు ప్రకటించటం , 3 G సేవల వేలం లో ప్రైవేటు ఆపరేటర్ల కు గాను కేవలం మూడు స్లాట్లు మాత్ర మే ఉన్నాయని ప్రకటించటం కూడా మార్కెట్లు పరిగణ లో కి తీసికోనున్నాయి.

చిన్ని తరహా , స్మాల్ క్యాప్ స్టాకు లు ఎగబాకుతున్న నేపధ్యం లో మార్కెట్లు త్వరలో దిద్దుబాటు కి గురి అయ్యే ఆకాశం లేక పోలేదు. పైగా 17493 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నకు గట్టి అవరోధం ఉన్నందున , మార్కెట్లు పెరిగినప్పుడు , మదుపర్లు కొంత సోమ్ముచేసుకునే ఆలోచన కూడా చేయవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17189
  • అవరోధాలు: 17198-17240-17373-17493
  • మద్దత్తులు:17002-16978-16844