• 10-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

నేటి ఉదయం మేము సూచించిన విధం గా నే మార్కెట్లు నష్టాల తో ప్రారంభమయ్యి, సానుకూల ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన మధ్యాన్నం పుంజుకొని , చివరికి స్వల్ప లాభాల తో ముగిసాయి. దీనితో నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి , 5134పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 64 పాయింట్ల లాభం తో 17189పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా సెన్సెక్స్ మేము సూచించిన కీలక స్థాయి అయిన 17198 పాయింట్ల కి అత్యంత సమీపం గా ముగియటం విశేషం.

నేటి ట్రేడింగ్ సమయంలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు మరొక సారి ఎగబాకాయి. నవంబర్ చివరి వారంలో ద్రవ్యోల్బణం 19.05 శాతానికి చేరుకుంది. బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, పప్పుదినుసుల ధరలు అమాంతం పెరిగాయి. అదే నవంబర్ నెల మూడవ వారంలో ద్రవ్యోల్బణం 17.47 శాతంగా ఉండింది.ఇదిలావుండగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై రానున్న జనవరి నెల 29న జరగనున్న చర్చించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కాగా రేపు అక్టోబర్ తాలూకు IIP గణాంకాలు విడుదల కానున్నాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్0.28 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం లాభపడ్డాయి. సేక్టరాల్ ఇండెక్స్ వారిగా పరిశీలిస్తే, నేడు క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.63 %, బ్యాంకింగ్ ఇండెక్స్ 0.75 % వృద్ధిని నమోదు చేయగా , కన్సుమర్ డ్యురబుల్స్ 0.8%, FMCG 0.7 % క్షీణించాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , ఉదయం మా అంచనాలకు అనుగుణం గా టెలికాం రంగం లాభాల లో నడవటం తో భారతి అయిర్ టెల్ అత్యధికం గా 3.4 % ఎగబాకింది. కాగా BHEL 2.8% లాభపడింది. నేడు సన్ ఫార్మ 1.8 %, హీరో హోండా 1.7 % నష్టపోయాయి.