• 10-12-2009

  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల నుండి లాభాల వైపు పయనించాయి. దీనితో గత మూడు రోజులు గా నష్టాల లో పయనిస్తున్న ప్రపంచ మార్కెట్లు నేడు కొంత ఊపిరి తీసుకుంటున్నాయి. ఐనప్పటికీ, నేడు అక్టోబర్ మాసానికి జపాన్ మెషీన్ల ఆర్డర్ల లో 4.5 % క్షీణత నమోదు చేయటం తో జపాన్ మార్కెట్లు తిరిగి నష్టాలను చవిచూస్తున్నాయి. అంచనా ప్రకారం 10 % వృద్ధిని ఆశించిన మార్కెట్ల కు ఈ అంశం మింగుడు పడక పోవటం తో అమ్మకాల జోరు కొనసాగుతోంది. కాగా , ఇతర ఆసియా మార్కెట్లు స్థిరంగా పయనిస్తున్నాయి.

ఈ పరస్పర విరుద్ధమైన అంశాల నడుమ మన మార్కెట్ల లో కొంత ఆటుపోట్ల కి గురయ్యే అవకాశం ఉంది. పైగా రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆర్ధిక మాంద్యం తారా స్థాయి లో ఉన్నప్పుడు , మనదేశ కంపనీలు నిధులను సమకూర్చుకునేందుకు FORIEGN CURRENCY CONVERTABLE BONDS కొనుగోళ్ళ పై ఇచ్చిన వెసులు బాటు జనవరి 1 నుండి ఉపసంహరించ నున్నది. ఈ కారణం గా నేడు మార్కెట్లు స్వల్పంగా నష్టాల తో ఆరంభం అయ్యే సూచనలు ఉన్నాయి. ఐతే రిజర్వు బ్యాంక్ టెలికాం, ఇన్ఫ్రా రంగాలకు కొన్ని నియమాలను సులభతరం చేసింది. కాబట్టి , నేటి ట్రేడింగ్ లో ఈ రంగాలు కొంత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17125
  • అవరోధాలు: 17198-17240-17373
  • మద్దత్తులు:17002-16978-16844