- 09-12-2009
- మార్కెట్ రిపోర్ట్
బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా నష్టాలను చవిచూసాయి. దీనితో నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి , 5112 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి ,17125 పాయింట్ల వద్ద ముగిసింది.ఈ ముగింపు మేము ఉదయం సూచించిన 17124 పాయింట్ల మద్దత్తు స్థాయి కి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం .
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.58 % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 0.36 % లాభాలను ఆర్జించింది. సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు మెటల్స్ ఇండెక్స్ భారి గా మెరుపును కోల్పోయి 2.09 % నష్టపోయింది. బ్యాంకింగ్ రంగం కూడా 1.58 % క్షీణించింది. కాగా ఐ. టి ఇండెక్స్ 0.81 %,టెక్ ఇండెక్స్ 0.74% మేరకు లాభపడ్డాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో , మారుతి సుజికి 2.54 % , హీరో హోండా 1.74 % లాభ పడగా, టాటా స్టీల్ 4.17 %, స్టర్ లైట్ 2.98 % నష్టపోయాయి.