• 9-12-2009
  • మార్కెట్ నాడి

నిన్న అమెరికా మార్కెట్లు వరుసగా రెండా రోజు కూడా నష్టపోయాయి. గ్రీసు దేశం కి గల క్రెడిట్ రేటింగ్ ని తగ్గించి వేయటం తో , ప్రపంచం ఇంకా ఆర్ధిక మాంద్యం నుండి కోలుకోలేదన్న ఆందోళన తో సెంటిమెంట్ బలహీనపడింది. ప్రెసిడెంట్ ఒబామా ప్రకటించిన పలు పన్ను రాయితీలు, నిరుద్యోగ సమస్య ని పరిష్కించే దిశగా ఆవిష్కరించిన ప్యాకేజి సైతం మార్కెట్ ని ఉత్సాహ పరచలేదు. నేడు ఆసియా మార్కెట్లు అన్ని కూడా నష్టాల లో పయనిస్తున్నాయి. నేడు జపాన్ లో విడుదల ఐన GDP గణాంకాలు విస్మయపరుస్తూ వెలువడటం ఇందుకు ప్రధాన కారణం . ఈ త్రైమాసిక వృద్ధి 4.8 % గా అంచనాలు ఉండగా, వృద్ధి కేవలం 1.3 % గా నమోదయ్యి అందరిని విస్మయ పరిచింది.

ఐతే మన మార్కెట్లు నిన్న ,ఆర్ధిక మంత్రి పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను తగ్గించే దిశ గా సుమారు 26, 000 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు ప్రకటించటం తో భారి గా ఎగబాకాయి. ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన ఈ వ్యయం వలన బడ్జెట్ లోటు మరింత గా పెరగనున్నది. కావున , దీర్ఘకాలిక దృశ్యా , ఈ అంశం మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేయనున్నది. కాబట్టి నేటి ట్రేడింగ్ లో మన మార్కెట్లు , ఆర్ధిక ప్రపంచ వాస్తవాలని విస్మరిస్తూ , కొంత ఎగబాకితే , మదుపర్లు , ఈ పెరుగుదలను తమ పోర్ట్ ఫోలియో ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోవటం మంచిది. మార్కెట్లు పెరిగి తే , అమ్మకాల కి ఉపయోగించికోవటం శ్రేయస్కరం.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17227
  • అవరోధాలు: 17240-17373-17490
  • మద్దత్తులు:17198-17124-17002-16978